Sri Ramanujacharya : సమతా మూర్తి నిత్య స్ఫూర్తి
శ్రీరామ నగరం సప్త వర్ణ శోభితం
Sri Ramanujacharya : కుల, మతాలు, వర్గ విభేదాలు వద్దన్నాడు. దైవం అందరికీ సమానం. ఈ మట్టి మీద జన్మించిన ప్రతి ఒక్కరికీ దైవాన్ని దర్శించుకునే హక్కు ఉందని నినదించాడు. గోపురం ఎక్కి చాటాడు.
మీ అందరి కోసం నేను అవసరమైతే నరకానికి వెళతానని ప్రకటించాడు వెయ్యేళ్ల కిందట జన్మించిన శ్రీ రామానుజాచార్యులు(Sri Ramanujacharya). ఆనాడే సమానత్వ భావనను చాటాడు.
ఇన్నేళ్లయినా ఆయన జీవన మార్గం నిత్యం పాఠంగా కొనసాగుతూనే వస్తున్నది. సత్యం, ధర్మం, నిష్టత, నియమం ఇవన్నీ మానవాళికి అవసరమని బోధించాడు.
సమస్త మానవాళి ఒక్కటేనని, సకల జీవరాశులు సమానమేనంటూ పిలుపునిచ్చాడు రామానుజుడు(Sri Ramanujacharya). ఆ మహనీయుడి మార్గాన్ని అనుసరిస్తూ ముందుకు సాగుతున్నారు.
శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో శ్రీరామనగరం ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. 45 ఎకరాల సువిశాల ప్రాంగణంలో రూ. 1000 కోట్లతో 216 అడుగుల సమతామూర్తి విగ్రహం కొలువు తీరింది.
ఇది రాబోయే తరాలకు స్పూర్తి దాయకంగా నిలువనుంది. ధర్మబద్దమైన జీవితం అలవడాలంటే భక్తి ఒక్కటే మార్గం అంటారు శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి.
ఒకరికి సహాయ పడటం, వారితో ప్రేమ పూర్వకంగా ఉండటం అన్నది కావాలి. దైవాన్ని దర్శించు కోవాలంటే నిబద్దతతో కూడిన భక్తి ప్రపత్తులు కలిగి ఉండాలంటారు.
నిష్ఠ, శ్రద్ద, దైవం పట్ల భావన ఇవి ప్రధానంగా ప్రతి ఒక్కరు అలవర్చు కోవాలని పిలుపునిస్తారు. భగవత్ అనుగ్రహం పొందాలంటే ఒక్కటే దారి. ఆ సమతా మూర్తిని స్వాగతించడం. ఆయన చూపిన మార్గంలో నడవడం.
Also Read : మోదీ రాక కోసం ‘సమతా కేంద్రం’ సిద్ధం