Statue Of Equality : దేశంలోనే మొదటిది ప్రపంచంలోనే రెండోదిగా ప్రసిద్ది చెందిన శ్రీ రామానుజుడి సమతామూర్తి విగ్రహం (Statue Of Equality)ఇప్పుడు చరిత్ర సృష్టించ బోతోంది.
ఆధ్యాత్మికతకు ఆలవాలమైన ప్రాంతంగా రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీరామనగరం కొలువు తీరింది. దీనిని కొన్నేళ్ల కిందట జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఏర్పాటు చేశారు.
ఆయన నిత్యం వెయ్యేళ్ల కిందట ఈ భువిపై నడయాడిన మహానుభావుడు, సంఘ సంస్కర్త శ్రీ రామానుజాచార్యుల్ని స్పూర్తిగా, మార్గ నిర్దేశంగా చేసిన వారిగా భావిస్తారు. జై శ్రీమన్నారాయణ అనే నినాదం నిత్య శ్లోకమై, నినాదమై ప్రతి క్షణం మ్రోగుతూనే ఉంటుంది.
వేలాది మంది భక్త జనుల పెదవులపై నడయాడుతూనే ఉంటుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన, నిర్మించిన, రూపు దిద్దుకున్న ఆ సమతామూర్తి కేంద్రం ఇప్పుడు ఆధ్యాత్మికతకు ఆలవాలమై వర్దిల్లుతోంది.
భక్త జన సందోహంతో అలరారుతోంది. సీఎం కేసీఆర్ చెప్పినట్లు తెలంగాణ ఇప్పుడు ఐటీ, ఫార్మా, ఈ కామర్స్ హబ్ నే కాదు ఆధ్యాత్మికత, పర్యాటక ప్రాంత హబ్ గా మారుతోందన్నారు.
ప్రస్తుతం ఈ ఏర్పాటు చేసిన రామానుజుడి విగ్రహం, సమతా కేంద్రం(Statue Of Equality) తెలంగాణకే మణిహారం కాబోతోంది. ఇవాళ ప్రధాని మోదీ ఆవిష్కరించిన అనంతరం ఆ మూర్తిని జాతికి అంకితం చేస్తారు.
దీంతో మరో కొత్త చరిత్రకు నాంది పలకబోతోంది ఈ ప్రాంతం. నేటి తరంతో పాటు రాబోయే తరాలు కూడా ఎల్లకాలం గుర్తు పెట్టుకుంటారు.
ఏది ఏమైనా దేశం చూపంతా ఇప్పుడు సమతా కేంద్రం వైపు చూస్తోందన్నది వాస్తవం.
Also Read : సమతా కేంద్రం ప్రశాంతి నిలయం