Statue Of Equality : దేశం చూపు స‌మ‌తా మూర్తి వైపు

దారుల‌న్నీ స‌మతా కేంద్రానికే

Statue Of Equality : యావ‌త్ భార‌తం అంతా ఇప్పుడు తెలంగాణ‌లో కొలువు తీరిన ఏర్పాటు చేసిన స‌మ‌తా మూర్తి శ్రీ రామానుజుడి విగ్ర‌హం వైపు చూస్తోంది.

ప్ర‌పంచంలో 316 అడుగుల ఎత్తుతో బ్యాంకాక్ లో బుద్దుడు విగ్ర‌హం కొలువు తీర‌గా ఇప్పుడు భార‌త దేశంలోని తెలంగాణ రాష్ట్రం రాజ‌ధాని హైద‌రాబాద్ కు స‌మీపంలోని ముచ్చింత‌ల్ శ్రీ‌రామ‌న‌గ‌రంలో ఏర్పాటైంది.

దీనిని దేశ ప్ర‌ధాని మోదీ ఆవిష్క‌రిస్తారు. అనంత‌రం భార‌త జాతికి అంకితం చేస్తారు. దీనికి ఘ‌న‌మైన చ‌రిత్ర ఉన్న‌ది. వెయ్యి సంవ‌త్స‌రాల కింద‌ట శ్రీ రామానుజాచార్యులు (Statue Of Equality)జ‌న్మించారు.

ఆయ‌న స‌మ‌త‌ను బోధించారు. స‌మాన‌త్వాన్ని కాంక్షించారు. కుల, మ‌త , వ‌ర్గ విభేదాల‌ను నిర‌సించారు. పండితులకే కాదు పామ‌రులకు కూడా దైవం స‌మానమేనంటూ చాటారు.

వెయ్యేళ్ల సుదీర్ఘ కాలం త‌ర్వాత ఇప్పుడు కొలువై ఉండ‌డం విశేషం. ఇందుకు సంబంధించి జ‌గ‌త్ గురుగా భాసిల్లుతున్న శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి శ్రీ‌రామ‌న‌గ‌రం (Statue Of Equality)పేరుతో ఆశ్ర‌మాన్ని ఏర్పాటు చేశారు.

ఇది 100 ఎక‌రాల‌లో విస్త‌రించి ఉంది. ఇక విగ్ర‌హం త‌యారీ కోసం, ఏర్పాటు చేసేందుకు ఏకంగా రూ. 1000 కోట్లు ఖ‌ర్చు చేశారు. స‌మతామూర్తి రామానుజుడి విగ్ర‌హం 216 అడుగులు ఉంది.

దీని బ‌రువు 18 వేల ట‌న్నులు. ఇక స‌మతా కేంద్రం అని దీనికి పేరు పెట్టారు చిన్న జీయ‌ర్ స్వామి. గ‌ర్భ గుడిలో 120 కిలోల బంగారు విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌డం విశేషం.

స‌మ‌తామూర్తి విగ్రహం చుట్టూ శ్రీ‌వైష్ణ‌వంలో దివ్య దేశాలుగా భావించే, ఆరాధించే 108 ఆల‌యాలు ఉన్నాయి. 36 అంగుళాల ఎత్తైన పీఠంపై 54 అంగుళాల రామానుజుల సువ‌ర్ణ మూర్తి ద‌ర్శ‌నం ఇస్తాడు.

Also Read : స‌మ‌తా మూర్తి స‌దా స్మ‌రామి

Leave A Reply

Your Email Id will not be published!