Modi : తెలంగాణలోని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఇవాళ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీరామనగరంకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన యాగ మహోత్సవంలో పాల్గొన్నారు. జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి మోదీకి (Modi)స్వాగతం పలికారు. మోదీ వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఉన్నారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి యాగంలో పాల్గొన్నారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆవిష్కరణకు ముందు ఆలయ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తి ప్రపత్తులతో బంగారు దుస్తులు ధరించారు. ప్రార్థన స్థలంలో కూర్చున్నారు.
బద్రీనాథ్, అయోధ్య, తిరుమలతో సహా 108 విష్ణు ఆలయాల ప్రతిరూపాలను ఏర్పాటు చేసిన ఆలయ ప్రాంగణాన్ని సందర్శించారు. ఇందులో భాగంగా చిన్న జీయర్ స్వామి స్వయంగా ఒక్కో విగ్రహం గురించి, దాని విశిష్టత గురించి ప్రధాని మోదీకి(Modi) వివరించారు.
ఇక ప్రపంచంలోనే రెండోవదిగా దేశంలోనే మొదటి భారీ విగ్రహాన్ని సమతా కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఇందు కోసం రూ. 1000 కోట్లు ఖర్చు చేశారు. ఈ విగ్రహాన్ని 216 అడుగులు ఉండడం విశేషం.
వెయ్యేళ్ల కిందట శ్రీ రామానుజులు ఈ భువిపై వెలిశారు. ఆనాడు కుల, మతాలు ఉండ కూడదని, సమస్త మానవాళి అంతా ఒక్కటేనని చాటారు.
ఈ విగ్రహం ఏర్పాటుకు 10 ఏళ్ల కిందట అంకురార్పణ చేశారు. ఆలయ గర్భగుడిలో 120 కేజీలతో రామానుజాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.