Ratha Saptami : ర‌థ స‌ప్త‌మికి తిరుమ‌ల ముస్తాబు

క‌రోనా దెబ్బ‌కు ఏకాంతంగానే

Ratha Saptami  : ఈనెల 8న ర‌థ‌స‌ప్తమి కావ‌డంతో దేశంలోని ఆల‌యాల‌న్నీ ముస్తాబ‌వుతున్నాయి. ర‌థ‌స‌ప్త‌మిని పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం వేడుక‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది.

ఇప్ప‌టికే టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వాలు జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగానే వేడుక‌ల‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది టీటీడీ.

సూర్య జ‌యంతిని ప్ర‌తి ఏటా ఫిబ్ర‌వ‌రి 8న ర‌థ స‌ప్త‌మి చేప‌డ‌తారు. ఇక తిరుమ‌లలో కొలువై ఉన్న ఆ శ్రీ వేంక‌టేశ్వ‌రుడి ఆల‌యంలో ర‌థ‌స‌ప్త‌మి(Ratha Saptami )ప‌ర్వ‌దినాన్ని ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో ఈసారి ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా గ‌త ఏడాది ర‌థ స‌ప్త‌మిని ఆల‌యం ఆవ‌ర‌ణ‌లో నిర్వ‌హించింది టీటీడీ. వాహ‌న సేవ‌ల ఊరేగింపు చేప‌ట్టంది.

శ్రీ‌వారు స‌ప్త వాహ‌నాల్లో మాడ వీదుల్లో ఊరేగుతారు. వేడుక‌ల్లో భాగంగా ఉద‌యం 6 గంట‌ల నుంచి 8 గంట‌ల వ‌ర‌కు సూర్య‌ప్ర‌భ వాహ‌నంపై విహ‌రిస్తారు. 9 గంట‌ల నుంచి 10 గంట‌ల దాకా చిన్న శేష వాహ‌నంపై ఊరేగుతారు.

11 గంట‌ల నుంచి 12 గంట‌ల దాకా గ‌రుడ వాహ‌న సేవ ఉంటుంది. మ‌ధ్యాహ్నం 1.00 గంట నుంచి 3.00 గంట‌ల దాకా హ‌నుమంత వాహ‌న సేవ చేప‌డ‌తారు.

సాయంత్రం 4 గంట‌ల నుంచి 5 గంట‌ల దాకా క‌ల్ప వృక్ష వాహ‌న సేవ చేప‌డుతుంది టీటీడీ(Ratha Saptami ). ఇక 6 గంట‌ల నుంచి 7 గంట‌ల వ‌ర‌కు స‌ర్వ భూపాల వాహ‌న సేవ ఉంటుంది.

రాత్రి 8 గంట‌ల నుంచి 9 గంట‌ల దాకా చంద్ర‌ప్ర‌భ వాహ‌న సేవ చేప‌డుతుంది. ఇక చంద్ర ప్ర‌భ వాహ‌నం ఊరేగింపుతో ర‌థ స‌ప్త‌మి వేడుక‌లు ముగుస్తాయ‌ని టీటీడీ తెలిపింది.

Also Read : స‌మ‌తామూర్తి మార్గం ఆచ‌ర‌ణీయం

Leave A Reply

Your Email Id will not be published!