Dera Baba : డేరా బాబాకు 21 రోజులు రిలీఫ్

అత్యాచార కేసులో దోషి

Dera Baba : ఇది ఊహించ‌ని ప‌రిణామం. కొద్ది రోజుల్లో హ‌ర్యానా, పంజాబ్ రాష్ట్రాల‌లో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న క‌లిగించిన అత్యాచార‌, హ‌త్య కేసులో జైలు శిక్ష‌కు గురైన డేరా బాబా అలియాస్ డేరా స‌చ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ కు రిలీఫ్ పెరిగింది.

ఆయ‌న‌కు 21 రోజుల పాటు జైలు నుంచి వెళ్లేందుకు ప‌ర్మిష‌న్ ల‌భించింది. ఈ అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. డేరా (Dera Baba)స‌చ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ 2002లో త‌న మేనేజ‌ర్ హ‌త్య కేసులో జీవిత ఖైదుగాఉన్నాడు.

2017లో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌పై అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభ‌విస్తున్నాడు ఇప్ప‌టికే. ఇదిలా ఉండ‌గా ఈ సాయంత్రం హ‌ర్యానా లోని రోహిత్ సింగ్ కు జిల్లాలోని సునారియా జైలు నుంచి బ‌య‌ట‌కు వెళ్లే చాన్స్ ఉంది.

21 రోజుల పాటు అనారోగ్యంతో ఉన్న త‌న త‌ల్లిని క‌లిసేందుకు, వైద్య ప‌రీక్ష‌లు చేయించు కునేందుకు పెరోల్ ఇచ్చే ఏర్పాటు చేశారు. హ‌ర్యానా జైళ్ల శాఖ మంత్రి రంజింత్ సింగ్ చౌతాలా స్పందించాడు.

గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ విడుద‌ల ప్ర‌మాద‌క‌రం క‌దా అన్న ప్ర‌శ్న‌కు ఈ విధంగా స‌మాధానం ఇచ్చాడు. చ‌ట్టం ప్ర‌కారం ఫ‌ర్ లాఫ్ పొంద‌డం ప్ర‌తి ఖైదీ హ‌క్కు అని, అందుకే డేరా చీఫ్ ఏసులో కూడా ఇదే వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి.

ప్ర‌త్యేకించి పంజాబ్ లో డేరా బాబాకు ప్ర‌త్యేక‌మైన ఓటు బ్యాంకు ఉంది. ఇందులో భాగంగానే అత‌డిని బ‌య‌ట‌కు తీసుకు వ‌చ్చింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

పంజాబ్ లోని మాల్వా ప్రాంతంలో డేరా(Dera Baba)అనుచ‌రులు, అభిమానులు, ఓట‌ర్లు పెద్ద ఎత్తున ఉన్నారు. వారి ఓట్లు కీల‌కంగా మార‌నున్నాయి.

Also Read : స‌మ‌తామూర్తి మార్గం ఆచ‌ర‌ణీయం

Leave A Reply

Your Email Id will not be published!