Amit Shah : రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన సమతాకేంద్రాన్ని దర్శించు కోనున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. ఇవాళ ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు విచ్చేస్తారు.
శ్రీశ్రీశ్రీ త్రిదండి రామనుజ చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో సహస్రాబ్ది మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జరిగే యాగంలో అమిత్ షా(Amit Shah) పాల్గొంటారు.
న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో 4.40 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. విమాన ప్రాంగణం నుంచి రోడ్డు మార్గం ద్వారా ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమానికి 4 గంటల 55 నిమిషాలకు చేరుకుంటారు.
సాయంత్ర 5 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా అంటే మూడు గంటలకు పైగా ఆశ్రమం లోనే ఉంటారు. రూ. 1000 కోట్లతో ఏర్పాటు చేసిన 216 అడుగుల శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని దర్శించుకుంటారు.
అంతే కాకుండా ఇదే ప్రాంగణంలో ప్రతిష్టించిన 108 దివ్య దేశాల సందర్శన, యాగ శాలలో పాల్గొననున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah). పూజలు చేసిన అనంతరం సమతామూర్తిని, ఆయన ప్రాశస్త్యం గురించి ప్రసంగిస్తారు.
కేంద్ర మంత్రి రానుండడంతో భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ సర్కార్. ఇప్పటికే ఆశ్రమ ప్రాంగణంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా మంగళవారం రథ సప్తమి ప్రారంభమైంది.
శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ఏడో రోజు. జీయర్ ఆస్పత్రి ప్రాంగణం నుంచి యాగశాల దాకా శోభాయాత్రను చేపట్టారు.
Also Read : చిన్నజీయర్ ఆశీర్వాదం జగన్ ఆనందం