Amit Shah : శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామిని ఆకాశానికి ఎత్తేశారు కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah). ఇవాళ ఆయన శ్రీ రామానుజుల సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొన్నారు.
సమతామూర్తిని దర్శించుకున్నారు. అనంతరం భక్త బాంధవులను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించారు. శ్రీ రామానుజుడు అందించిన సందేశం గొప్పదని చెప్పారు.
సనాతన ధర్మంలో ఉన్న గొప్పదనం ఏమిటో తెలుసు కోవాలని సూచించారు. 216 అడుగులతో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహం రాబోయే తరాల వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందని కొనియాడారు అమిత్ షా(Amit Shah).
శ్రీరామనగరాన్ని దర్శించు కోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. మనుషలంతా ఒక్కటేనన్న అందించిన సందేశం చిరస్మరణీయమని పేర్కొన్నారు అమిత్ షా. దేశాన్ని సమానత్వంతో అనుసంధానం చేశారు.
ఆనాటి రామానుజుడి మార్గం గురించి, ఆయన చేసిన ప్రయత్నం గురించి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కూడా ఉదహరించాడని ఈ సందర్భంగా అమిత్ షా ప్రత్యేకంగా ప్రస్తావించారు.
కుల వివక్షను అంతం చేసేందుకు రామానుజుడు కృషి చేశాడని ఆ దిశగా తాము కూడా పాలన సాగిస్తున్నామన్నారు అమిత్ షా. మనుషులంతా ఒక్కటేనని, సర్వ ప్రాణులన్నీ సమానమేనని స్పష్టం చేసిన తీరు గొప్పదన్నారు.
సనాతన ధర్మంలో అహం అన్నది లేదన్నారు. చిన్న జీయర్ స్వామి చేసిన ప్రయత్నానికి దేశం తరపున తాను కృతజ్ఞతలు తెలియ చేస్తున్నానని చెప్పారు.
2003 నుంచి తనకు స్వామితో పరిచయం ఉందన్నారు. గుజరాత్ లో భూకంపం సంభవించినప్పుడు అక్కడ సేవలు అందించారని చెప్పారు అమిత్ షా.
Also Read : చిన్నజీయర్ ఆశీర్వాదం జన్మ ధన్యం