Venkaiah Naidu : తిరుమలను దర్శించుకున్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆయన మనుమరాళి పెళ్లి పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వెంకయ్య (Venkaiah Naidu)ఫ్యామిలీ మొత్తం ఇక్కడే కొలువై ఉంది.
ఇదిలా ఉండగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వెంకయ్య నాయుడు. సంవత్సరానికి ఒక సారి మాత్రమే శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ ను దర్శనం చేసుకోవాలని కోరారు.
దీని వల్ల ప్రతి ఒక్కరికీ దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు స్వామి వారి కృపకు పాత్రులు కావాలని, హిందూ ధర్మ పరిరక్షణ, భారతీయ సంప్రదాయాలను ప్రపంచానికి అందజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉందని స్పష్టం చేశారు ఉప రాష్ట్రపతి.
ఇదిలా ఉండగా తిరుమలకు ప్రతి రోజూ వేలాది మంది దర్శనం కోసం వస్తుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలి వస్తారు ఇక్కడికి. ప్రస్తుతం కరోనా కారణంగా రూల్స్ ప్రకారం భక్తులకు అనుమతి ఇస్తోంది టీటీడీ.
ఈ సమయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే దర్శనం చేసుకోవాలని సూచించారు.
దీని వల్ల ఇతరులు స్వామి వారిని దర్శనం చేసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు ఉప రాష్ట్రపతి. ఇదిలా ఉండగా శ్రీవారిని దర్శించు కోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు.
ప్రాతః సమయంలో దర్శనం చేసుకోవడం సంతోషం కలిగించిందన్నారు. తిరుమలకు ఎన్ని సార్లు వచ్చిన నూతన ఉత్తేజం కలుగుతుందన్నారు.
ఇక తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.02 కోట్లు వచ్చిందని టీటీడీ వెల్లడించింది.
Also Read : రామానుజుడి మార్గం శిరోధార్యం