Raj Nath Singh : వెయ్యేళ్ల కిందట ఈ పవిత్ర భూమిపై జన్మించిన కారణ జన్ముడు శ్రీ రామానుజుడు. ఆనాడే పామరులు, దళితులు, అంటరాని వారిని చేర దీసి వారికి కూడా ఆలయ ప్రవేశం ఉండాలని నినదించిన మహనీయుడన్నారు.
ప్రశసంలతో ముంచెత్తారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Raj Nath Singh). ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమాన్ని ఇవాళ సందర్శించారు.
కేంద్ర మంత్రితో పాటు ప్రపంచ ఆధ్యాత్మిక వేత్త శ్రీశ్రీ రవిశంకర్ తో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యాగ శాలలో నిర్వహించిన పూజలలో పాల్గొన్నారు.
వారికి వేద మంత్రోశ్చారణల మధ్య మంగళాశాసనాలు అందజేశారు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి . శ్రీ రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగడాన్ని ప్రత్యేకంగా అభినందించారు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Raj Nath Singh)
. ప్రత్యేకించి చిన్న జీయర్ స్వామి చేస్తున్న కృషి గొప్పదన్నారు. సమతా మూర్తి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆయనకే సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా సమతాకేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ ప్రతిమను రామానుజాచార్యుల మరో అవతారంగా భావిస్తున్నానని చెప్పారు. ఇంతటి మహత్తరమైన కార్యక్రమంలో పాలు పంచు కోవడం ఆనందంగా ఉందన్నారు.
చిన్న జీయర్ చేస్తున్న ప్రయత్నం సర్వదా విజయవంతం అవుతుందని ఆకాంక్షించారు శ్రీశ్రీ రవిశంకర్. వెయ్యి ఏళ్ల కిందటే అన్ని దేవాలయాల తలుపులు అన్ని కులాల వారి కోసం తెరిచి ఉంచారని కొనియాడారు రామానుజుడిని. ముచ్చింతల క్షేత్రం భవిష్యత్తులో ఆధ్యాత్మిక నగరంగా భాసిల్లుతుందన్నారు గవర్నర్ .
Also Read : శ్రీరామనగరం రామానుజ మంత్రం