Statue Of Equality : ముచ్చింతల్ లో కొలువై ఉన్న శ్రీరామనగరం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. దేశం నలుమూలల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా ఆశ్రమ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
5 వేల మందికి పైగా రిత్వికులు, పండితులు, ఆచార్యులు, స్వాములు, పీఠాధిపతులు కొలువు తీరారు. దేశానికి సమతామూర్తి స్పూర్తి దాయకంగా నిలిచేలా తీర్చిదిద్దారు. ఈ ఘనత మాత్రం ఒక్కరిదే.
జగత్ గురువుగా పేరొందిన శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో సమతా కేంద్రాన్ని(Statue Of Equality) ఏర్పాటు చేశారు. దేశం చూపు మొత్తం ముచ్చింతల్ వైపు చూస్తోంది.
పదేళ్ల కిందట వచ్చిన ఆలోచనకు కార్యరూపం దాల్చేలా చేయడంలో విజయవంతం అయ్యారు. రూ. 1000 కోట్లతో 216 అడుగులతో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలో మొదటి విగ్రహం బుద్దుడిది.
ఆ స్టాట్యూ బ్యాంకాక్ లో కొలువు తీరింది. సమతామూర్తి సహస్రాబ్ది మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈనెల 2న అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
ఈ ఉత్సవాలు 14 వరకు కొనసాగనున్నాయి. దేశాన్ని పాలించే పాలక వర్గంలోని కీలక వ్యక్తులంతా ఇక్కడ కొలువు తీరేలా ప్లాన్ చేశారు. దీని క్రెడిట్ అంతా చిన్న జీయర్ స్వామి వారిదే. 5న దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు.
శ్రీ రామానుజుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దేశానికి గర్వ కారణంగా నిలిచిన ఈ విగ్రహాన్ని(Statue Of Equality) జాతికి అంకితం చేశారు. రుత్వికులు, పండితులు, అర్చకులు ప్రధానికి ఆశీస్సులు అందజేశారు. చిన్న జీయర్ స్వామి మంగళా శాసనాలు అందించారు.
Also Read : రామానుజుడి మార్గం శిరోధార్యం