Chinna Jeeyar : శ్రీ భగవద్ రామానుజాచార్యులు చూపిన మార్గం గొప్పది. టెక్నాలజీ విస్తరించినా వెయ్యేళ్లు దాటినా నేటికీ సమతామూర్తి అందించిన స్పూర్తి కొనసాగుతూనే ఉన్నది.
రేపటి తరాలకు కూడా ఇది పాఠంగా ఉండనుందని సెలవిచ్చారు జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి(Chinna Jeeyar).
ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన సమతామూర్తి మహోత్సవాలలో భాగంగా శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన ధర్మ ప్రచార సభలో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆనాడే ఆలయంలోకి ప్రవేశించేందుకు అందరూ అర్హులేనని భగవద్ రామానుజుల వారు స్పష్టం చేశారు. తోటి ప్రాణులు కూడా బతికేందుకు అర్హులేనని చాటాడు.
ఆలయం అన్నది సంస్కరణకు మూలం కావాలన్నారు. దేశంలోని ఆలయాలన్నీ అభివృద్ధి చెందితే సమాజంలో అసమానతలు అన్నీ పోతాయని చిన్న జీయర్ స్వామి స్పష్టం చేశారు.
మనుషుల్ని సృష్టించిన దైవం ఎక్కడా పక్షపాతం చూపలేదని అన్నారు. దేవుడి దృస్టిలో అంతా సమానమేనని, సర్వ ప్రాణులకు కూడా జీవించే హక్కు ఉందని చాటాడని తెలిపారు.
ముందుగా దైవం పట్ల ఎరుక కావాలంటే అహం వీడాలి. భగవంతుని సేవగా సమస్త ప్రాణులను ప్రేమించండి అని బోధించాడన్నారు. ఎవరినీ కించపర్చ వద్దు. ఇంకెవరినీ తప్పు పట్టవద్దని సూచించారని చెప్పారు చిన్న జీయర్ స్వామి(Chinna Jeeyar).
అత్యంత ముఖ్యమైనది మనస్సు, కర్మ కు సంబంధించిన స్వచ్ఛత. పెరంబదూరులో జన్మించిన శ్రీ భగవద్ రామానుజాచార్యులు తత్వవేత్తగా, సంఘ సంస్కర్తగా , శ్రీ వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన అతి ముఖ్యమైన ఘట్టాలలో ఒకరిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తించ బడ్డారని వెల్లడించారు చిన్న జీయర్ స్వామి.
Also Read : రామానుజుడు ప్రాతః స్మరణీయుడు