Nitin Gadkari : స్వామి స‌న్నిధికి నితిన్ గ‌డ్క‌రీ

భ‌క్త జ‌న సందోహం స‌మ‌తా కేంద్రం

Nitin Gadkari  : ముచ్చింత‌ల్ లోని శ్రీ‌రామ న‌గ‌రంకు ఇవాళ కేంద్ర ఉప‌రిత‌ల‌, ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ (Nitin Gadkari )రానున్నారు. శ్రీ భ‌గ‌వ‌ద్ రామానుజాచార్యుల స‌మ‌తామూర్తి విగ్ర‌హాన్ని ద‌ర్శించుకుంటారు.

భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. ఈ సంద‌ర్భంగా ప్రాంగ‌ణంలో ఏర్పాటు చేసిన 108 దివ్య దేశాల‌ను తిల‌కిస్తారు. 13న రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ రానున్నారు.

ఇవాళ ప‌దో రోజు ఉత్స‌వాలు కొన‌సాగుతున్నాయి. ఆ ప్రాంతమంతా భ‌క్త జ‌న‌సందోహంతో అల‌రారుతోంది. ఎక్క‌డ చూసినా జై శ్రీ‌మ‌న్నారాయ‌ణ నినాదాలే మోగుతున్నాయి.

ఇవాళ ఉద‌యం అష్టాక్ష‌రీ మంత్ర ప‌ఠ‌నం చేశారు. శ్రీ రామ పెరుమాళ్ స్వామి వారికి ప్రాతః కాల ఆరాధ‌న పూర్త‌యింది. అనంత‌రం రుత్వికుల ఆధ్వ‌ర్యంలో వేద పారాయ‌ణం గావించారు.

శ్రీల‌క్ష్మీ నారాయ‌ణ మ‌హా య‌జ్ఞం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. 108 దివ్య దేశాల్లోని 36 దేవాలయాల్లో ప్రాణ ప్ర‌తిష్ట చేశారు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి. మ‌హా సంప్రోక్ష‌ణ కార్య‌క్ర‌మం పూర్త‌యింది.

ఇష్టి శాల‌లో విద్యా ప్రాప్తి కోసం హ‌య‌గ్రీవ ఇష్టి, ప్ర‌వ‌చ‌న మండ‌పంలో శ్రీ ల‌క్ష్మీ నారాయ‌ణ అష్టోత్త‌ర పూజ చేప‌ట్టారు. ఉత్స‌వాల‌లో భాగంగా పూర్ణాహుతి, ప్ర‌ముఖుల‌తో ప్ర‌వ‌చ‌నాలు కొన‌సాగుతున్నాయి.

క‌ళాకారుల సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. భ‌క్తుల‌ను అల‌రిస్తున్నాయి. శ్రీ లక్ష్మీ నారాయ‌ణ మ‌హా యజ్ఞం, రాత్రి 9 గంట‌ల‌కు పూర్ణాహుతి కార్య‌క్ర‌మం కొన‌సాగుతుంది.

Also Read : అహం వీడండి సామాజిక సేవ‌లో త‌రించండి

Leave A Reply

Your Email Id will not be published!