Rahul Gandhi : ఆధ్యాత్మిక గురువుగా, దళితుల ఆశా జ్యోతిగా భావించే సాధు గురువు రవిదాస్ జయంతి ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వారణాసి లోని రవిదాస్ ఆలయాన్ని దర్శించారు.
అక్కడ భక్తులకు వడ్డించారు. లంగర్ సేవ చేశారు. గురు కృపకు పాత్రులైన వారందరికీ సంతోషకరమైన, సౌకర్య వంతమైన జీవితాన్ని అందించేలా మీరు దీవించాలంటూ ప్రార్థించారు అన్నా చెల్లెలు.
15 -16 వ శతాబ్దానికి చెందిన కవి, సంఘ సంస్కర జన్మ స్థలమైన సీర్ గోవర్దన్ లో రాహుల్ గాంధీ(Rahul Gandhi ), ప్రియాంక గాంధీలు లంగర్ సేవ చేశారు. బబత్ పూర్ లోని విమానాశ్రయానికి చేరుకున్నారు.
అక్కడ వారికి మాజీ ఎమ్మెల్యే అజయ్ రాయ్ తో సహా స్థానిక నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా గురు రవిదాస్ ఆలయానికి వెళ్లారు.
యూపీ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి రాహుల్ గాంధీకి(Rahul Gandhi )గురు రవిదాస్ ఫ్రేమ్ లో ఉన్న చిత్రాన్ని బహూకరించారు. కులం, మతంతో సంబంధం లేకుండా అందరికీ సమానత్వం , గౌరవం కోసం ప్రయత్నం చేశారు.
వారందరికీ గౌరవం ఇవ్వాలని బోధించాడు. ఆచరణలో చేసి చూపించాడు. ఆనాటి నుంచి నేటి దాకా ఆయన చూపిన మార్గం, స్పూర్తి నేటికీ కొనసాగుతూనే ఉన్నది. గురు రవిదాస్ లింగ సమానత్వం ఉండాలని అన్నాడు.
కులం ఆధారంగా సమాజ విభజనను వ్యతిరేకించాడు. మరో వైపు పంజాబ్ నుంచి లక్షలాది మంది తరలి వచ్చారు గురు దాస్ ఆలయానికి. ఇవాళ ప్రత్యేకంగా సీఎం చరణ్ జిత్ సంగ్ చన్నీ హాజరు కావడం విశేషం.
Also Read : గురు రవిదాస్ భక్తి మార్గం శిరోధార్యం