Calcutta High Court : పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ కర్ ను తొలగించాలని ఆయన వల్ల రాష్ట్రానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టి వేసింది కోల్ కత్తా హైకోర్టు(Calcutta High Court ).
ఈనెల 8న న్యాయవాది రామ్ ప్రసాద్ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. భారత రాజ్యాంగాన్ని రక్షించాల్సిన గవర్నర్ జగదీప్ గవర్నర్ అందుకు పూర్తిగా విరుద్దంగా వ్యవహరిస్తున్నారంటూ పిటిషన్ లో పేర్కొన్నాడు.
అంతే కాకుండా ఆయన జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి మౌత్ పీస్ గా మారాడని, దీంతో రాష్ట్రంలో పాలనా పరంగా ప్రజలకు, అటు ప్రభుత్వానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాని వాపోయాడు.
వెంటనే ప్రజా ప్రయోజనాల రీత్యా అతడిని తొలగించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు గవర్నర్ ను తొలగించేలా దిశా నిర్దేశం చేయాలని పిటిషన్ దారుడు కోరాడు.
న్యాయావాది రామ్ ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ కోల్ కత్తా హైకోర్టు(Calcutta High Court )విచారణ చేపట్టింది. గవర్నర్ ను తొలగించే అధికారం తమ పరిధిలోకి రాదంటూ రిట్ పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది.
ఇదిలా ఉండగా పిటీషన్ లో కీలక వ్యాఖ్యలు చేశారు న్యాయవాది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరులో ధన్ కర్ కావాలని జోక్యం చేసుకుంటున్నారని, మమతా బెనర్జీని కావాలని ఇబ్బందులు పెడుతున్నారంటూ ఆరోపించారు.
రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ధన్ ఖర్ రాష్ట్ర మంత్రి మండలిని కాదని తానే సుప్రీం గా వ్యవహరిస్తున్నాడంటూ తెలిపాడు.
Also Read : ఉచిత విద్యుత్ వద్దన్నందుకే తొలగించాం