Sukhbir Singh Badal : పంజాబ్ ఎన్నికలకు ఇంకా కొద్ది గంటలు ఉందనగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ – ఏడీఆర్ ఆ రాష్ట్రానికి సంబంధించి ఆయా పార్టీల నేతల ఆస్తుల వివరాలు వెల్లడించింది.
ప్రస్తుతం ఈ వివరాలు కలకలం రేపుతున్నాయి. గత ఐదేళ్లలో చట్ట సభల సగటు ఆస్తి రూ. 2.76 కోట్లు లేదా 21 శాతంగా ఉండడం విశేషం. ఇక పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ సంపద రూ. 5 కోట్లకు తగ్గిందని తెలిపింది.
మాజీ సీఎం అమరీందర్ సింగ్ చన్నీ రూ. 5 కోట్లు పెరగడం విశేషం. ఇక 2017లో రూ. 20 కోట్లుగా ఉన్న శిరోమణి అకాళీదళ్ కు చెందిన సుఖ్ బీర్ సింగ్ బాదల్ ఎన్నికల తర్వాత రూ. 100 కోట్లు పెరిగిందని నివేదిక వెల్లడించింది.
ఇదే ఏడాది రూ. 14.51 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని సీఎం చన్నీ ప్రకటించారు. ఈ ఏడాది రూ. 9.45 కోట్లకు తగ్గిందని తెలిపంది. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ సిద్దూ రూ. 1.25 కోట్లు తగ్గిందని పేర్కొంది.
2017లో ఆయన ఆస్తుల విలువ రూ. 45.90 కోట్లుగా చూపిస్తే ఈ ఏడాది రూ. 44.65 కోట్లకు పడి పోయింది. ఏడీఆర్(Sukhbir Singh Badal )తన నివేదికను వెల్లడించింది.
ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న 101 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్ లను ఏడీఆర్, పంజాబ్ ఎలక్షన్ వాచ్ కలిసి విశ్లేషణ చేశాయి. ఈనెల 20న ఒకే రోజు పోలింగ్ జరగనుంది.
వివిధ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు సహా పోటీ చేస్తున్న 101 మంది ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ. 13. 34 కోట్లు కాగా ఇప్పుడు రూ. 16.10 కోట్లకు పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది.
ఆప్ కు చెందిన అమన్ అరోరా ఆస్తుల విలువ రూ. 29 కోట్లకు పెరిగింది.
Also Read : లాలూ ప్రసాద్ కు ప్రియాంక సపోర్ట్