Hijab Issue : హిజాబ్ వివాదం ఇంకా వీడడం లేదు. కర్ణాటక హైకోర్టు ఇంకా తీర్పు వెలువరించ లేదు. ఫైనల్ తీర్పు వచ్చేంత దాకా ఎవరూ ఎలాంటి దుస్తులు ధరించ కూడదని స్పష్టం చేసింది.
ఇదిలాఉండగా హిజాబ్ (Hijab Issue)ఆందోళనలో పాల్గొన్న 58 మంది స్టూడెంట్స్ ను శివమొగ్గ లోని కర్ణాటక పబ్లిక్ స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.
ఈ స్కూల్ కు చెందిన స్టూడెంట్స్ మొదటి నుంచి హిజాబ్ కు మద్దతుగా ఆందోళనలో పాల్గొంటున్నారు. హిజాబ్(Hijab Issue) అన్నది తర తరాల నుంచి వస్తున్నదని, దీనిని వద్దంటే ఎలా వాళ్లు నిలదీస్తున్నారు.
ఈ మేరకు హిజాబ్ తమ జన్మ హక్కు అంటూ ఆందోళన బాట పట్టారు. నిరసనలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇదిలా ఉండగా కేసు తేల్చేంత వరకు ఎలాంటి వస్త్రాలు వాడ కూడదని కోర్టు స్పష్టం చేసింది.
ఒక రకంగా హెచ్చరించింది కూడా. కోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ స్టూడెంట్స్ హిజాబ్ లు ధరించి స్కూళ్లకు వచ్చారు. ఇంకొందరు స్టూడెంట్స్ కావాలని వస్తూనే ఉండడంతో గమనించిన మేనేజ్ మెంట్ వారిపై వేటు వేసింది.
ఇదిలా ఉండగా హిజాబ్ కు సపోర్ట్ గా పాల్గొన్న కొందరిపై 144 సెక్షన్ కింద శివమొగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ముస్లింలు ధరించే వస్త్రాధరణలో హిజాబ్ అన్నది ఓ భాగం కానేకాదని రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక హైకోర్టుకు తెలిపింది.
హిజాబ్ ధరించడం అన్నది ప్రాథమిక హక్కుల పరిధిలోకి వస్తుందా రాదా అన్నది తేల్చాల్సి ఉందని కోర్టు అభిప్రాయ పడింది.
Also Read : ‘చన్నీ..మూసేవాలా’పై కేసు నమోదు