Amarinder Singh : కెప్టెన్ జోస్యం కాంగ్రెస్ ఖ‌తం

పంజాబ్ లోక్ కాంగ్రెస్ చీఫ్ కెప్టెన్

Amarinder Singh : పంజాబ్ లో జోరుగా పోలింగ్ కొన‌సాగుతోంది. ఓట‌ర్లు త‌మ ఓటు వేసేందుకు బారులు తీరారు. మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ చీఫ్ కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ (Amarinder Singh)తో పాటు సీఎం చ‌న్నీ,

అకాలీద‌ళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాద‌ల్ , ఆప్ సీఎం అభ్య‌ర్థి భ‌గ‌వంత్ మాన్ , పంజాబ్ కాంగ్రెస్ క‌మిటీ చ‌ఫ్ న‌వ జ్యోత్ సింగ్ సిద్దూ ఓటు వేశారు. అమృత్ స‌ర్ లోని మ‌న‌వాల‌లోని ఓటింగ్ కేంద్రం వ‌ద్ద ఓట‌ర్లు తెల్ల‌వారుజాము నుంచే ఓటు వేసేందుకు నిలిచి ఉన్నారు.

ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ వ‌ర్సెస్ ఆప్ గా మారింది. రాష్ట్రంలో 117 నియోక‌వ‌ర్గాల‌కు పోలింగ్ జ‌రుగుతోంది. దేశంలోని ఐదు రాష్ట్రాల‌లో పోలింగ్ కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఏర్పాట్లు చేసింది.

మొత్తం 1,304 మంది అభ్య‌ర్థుల భ‌విత‌వ్యాన్ని 2 కోట్ల 14 మంది ఓట‌ర్లు నిర్ణ‌యించ‌నున్నారు. గ‌త ఏడాది కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టి కొత్త పార్టీ ఏర్పాటు చేశారు కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్(Amarinder Singh).

ఆయ‌న భార‌తీయ జ‌న‌తా పార్టీతో క‌లిసి పోటీ చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం వ‌ర‌కు కొన‌సాగ‌నుంది పోలింగ్. అమ‌రీందర్ సింగ్ ప్ర‌స్తుతం పాటియాలా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తాను గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

ఈసారి ఎన్నిక‌ల్లో పంజాబ్ నుంచి కాంగ్రెస్ తుడిచి పెట్టుకు పోతుంద‌న్నారు. వారు వేరే ప్ర‌పంచంలో నివ‌సిస్తున్నారు. ఇక వారిని ప్ర‌జ‌లు కోలుకోలేని షాక్ ఇస్తార‌ని అన్నారు.

ఓటు వేశాక మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండ‌గా త‌న‌కు గెలిచే స‌త్తా ఉంద‌ని కానీ కాంగ్రెస్ హైక‌మాండ్ ప‌ట్టంచు కోలేద‌ని సీఎం చ‌న్నీ సోద‌రుడు మ‌నోహ‌ర్ సింగ్ వాపోయాడు.

Also Read : రైతుల పంతం బీజేపీ అంతం

Leave A Reply

Your Email Id will not be published!