Sidhu : పంజాబ్ పీసీసీ చీఫ్ నవ జ్యోత్ సింగ్ సిద్దూ సంచలన కామెంట్స్ చేశారు. ఇవాళ రాష్ట్రంలో 117 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. అమృత్ సర్ తూర్పు లో బరిలో ఉన్నారు సిద్దూ.
ఇవాళ తన ఓటు హక్కు వినియోగించారు. అనంతరం సిద్దూ(Sidhu) మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఖతం అని పేర్కొన్న మాజీ సీఎం , పంజాబ్ లోక్ కాంగ్రెస్ చీఫ్ కెప్టెన్ అమరీందర్ సింగ్, అకాలీ దళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ లపై నిప్పులు చెరిగారు.
కెప్టెన్ రాష్ట్రాన్ని మాఫియాకు అడ్డాగా మార్చారంటూ ధ్వజమెత్తారు సిద్దూ. ఇక బాదల్ డ్రగ్స్ ను పెంచి పోషించారంటూ ఆరోపించారు సిద్దూ. ఆ రెండు కుటంబాలను ఉద్దేశించి మాఫియాస్ ఆఫ్ ఫ్యామిలీస్ అంటూ ఎద్దేవా చేశారు.
పంజాబ్ రాష్ట్రం ఒక తరాన్ని ఉగ్రవాదంతో కోల్పోయిందన్నారు. ఇంకో తరాన్ని డ్రగ్స్ ముప్పుతో కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు జాగ్రత్తతో ఓటు వేయాలని సిద్దూ కోరారు.
మాఫియా డాన్లకు ప్రజాస్వామ్యాన్ని, ప్రజల కోసం పని చేసే కాంగ్రెస్ పార్టీకి మధ్య జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు. తమ భవిష్యత్తు బాగు పడేందు కోసం ప్రజలు పూర్తిగా తమ వైపు ఉన్నారని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పంజాబ్ ను నాశనం చేసిన ఘనత అమరీందర్ సింగ్, సుఖ్ బీర్ సింగ్ బాదల్ దేనని స్పష్టం చేశారు. ఆ రెండు కుటుంబాలు మాఫియాకు, డ్రగ్స్ కు కేరాఫ్ గా మారాయన్నారు సిద్దూ.
ధర్మం అధర్మానికి మధ్య జరుగుతునన పోరాటంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 2 కోట్ల 15 మంది ఓటర్లు ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు.
Also Read : పంజాబ్ లో శాంతి భద్రతలు ముఖ్యం