KCR PAWAR : ప్ర‌త్యామ్నాయ వేదిక అవస‌రం

ప్ర‌క‌టించిన కేసీఆర్..శ‌ర‌ద్ పవార్

KCR PAWAR  : దేశంలో ఇప్పుడు బ‌తికే ప‌రిస్థితులు లేవు. ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న చందంగా ఉంది. ఫెడ‌ర‌ల్ స్ఫూర్తికి విరుద్దంగా కేంద్రం వ్య‌వ‌హ‌రిస్తోంది.

ఈ త‌రుణంలో దేశంలోని ప్రాంతీయ పార్టీల‌న్నీ ఏకం కావాల్సిన స‌మ‌యం ఆస‌న్న మైంద‌న్నారు సీఎం కేసీఆర్KCR PAWAR ). ఇవాళ ఆయ‌న మ‌ర్యాద పూర్వ‌కంగా ముంబైలో ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్(KCR PAWAR )ను క‌లుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా దేశంలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. బ‌ల‌మైన బీజేపీకి ధీటుగా మ‌రో ప్ర‌త్యామ్నాయం అవ‌స‌ర‌మ‌న్నారు. అనంత‌రం కేసీఆర్, శ‌ర‌ద్ ప‌వార్ మీడియాతో మాట్లాడారు.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాల‌పై చ‌ర్చించామ‌న్నారు. మ‌రాఠా నుంచి ఆవిర్భ‌వించిన ఫ్రంట్ విజ‌య‌వంత‌మైంద‌ని చెప్పారు. అదే స్ఫూర్తితో ముందుకు సాగుతామ‌ని స్ప‌ష్టం చేశారు.

అపార‌మైన అనుభ‌వం క‌లిగిన రాజ‌కీయ నాయ‌కుడు శ‌ర‌ద్ ప‌వార్ అని కొనియాడారు. ఈ చ‌ర్చ‌లు ఆరంభం మాత్ర‌మే అని మున్ముందు పురోగ‌తి కంటిన్యూ అవుతుంద‌న్నారు.

త్వ‌ర‌లోనే అన్ని ప్రాంతీయ పార్టీలతో స‌మావేశం ఉంటుంద‌న్నారు. ఈ మేర‌కు తాము భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. త్వ‌ర‌లోనే త‌మ అజెండా వెల్ల‌డిస్తామ‌న్నారు.

1969 ఉద్య‌మ కాలం నుంచీ శ‌ర‌ద్ ప‌వార్ తెలంగాణ పోరాటానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించార‌ని ప్ర‌శంసించారు. ఆనాటి నుంచి నేటి దాకా స‌పోర్ట్ గా ఉన్న‌రాన్నారు.

చిన్న వ‌య‌సు లోనే సీఎంగా పాల‌న సాగించిన అరుదైన నేత ప‌వార్ అని కొనియాడారు.  దేశం కోసం స‌రైన అజెండా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఇద్ద‌రు నేత‌లు అభిప్రాయ‌ప‌డ్డారు.

Also Read : అబ‌ద్దాలు ఆడ‌డంలో కేసీఆర్ దిట్ట

Leave A Reply

Your Email Id will not be published!