YS Jagan : ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంపై సీఎం జగన్ రెడ్డి (YS Jagan )స్పందించారు. తనకు నోట మాట రావడం లేదన్నారు.
ఎంతో విజన్ ఉన్న అరుదైన నాయకుడు గౌతమ్ రెడ్డి. ఏపీకి ప్రధానంగా తనకు తీరని లోటు అని పేర్కొన్నారు. అన్ని అంశాలపై మంచి పట్టుంది. ప్రత్యేకించి ఏపీకి ఐటీ, పరిశ్రమల పరంగా ఎంతో చేయాలని అనుకున్నాడు.
అందులో చాలా వాటికి సక్సెస్ అయ్యాడు కూడా. అందుకే ఏరికోరి ఆ శాఖలను అప్పగించా. కానీ ఇంత త్వరగా, ఇంత చిన్న వయసులో వెళ్లి పోతాడని అనుకోలేదని పేర్కొన్నారు.
ఏది మాట్లాడినా డెప్త్ ఉండేదని, రాజకీయ నాయకుడే కాదు గొప్ప స్నేహ శీలి అని కొనియాడారు. ఇవాళ కేబినెట్ లో గౌతమ్ రెడ్డి లేడన్న దానినే ఊహించు కోలేక పోతున్నానని పేర్కొన్నారు సీఎం.
ఎంతో ఆప్యాయంగా అన్నా అని పిలిచే తమ్ముడిని కోల్పోవడం బాధగా ఉందన్నారు. ఇంతకంటే తాను ఇంకేమీ చెప్పలేనని వాపోయారు. ఇదిలా ఉండగా రెండు సార్లు మేకపాటి గౌతమ్ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఆయనకు ఏరికోరి ఐటీ, ఇండస్ట్రీస్ శాఖలను అప్పగించారు. వాటిని ఆయన సమర్థవంతంగా నిర్వహంచారు. చని పోయేంత వరకు ఆయన తన శాఖ గురించే ఆలోచించారు.
వారం రోజుల పాటు దుబాయిలో జరిగిన ఎక్స్ పోలో పాల్గొన్నారు. పలు కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఆదివారం హైదరాబాద్ కు వచ్చారు. ఇవాళ కన్ను మూశారు.
Also Read : మేకపాటి గౌతం రెడ్డి ఇక లేరు