Akhilesh Yadav : యూపీలో మూడో విడత పోలింగ్ ముగిసింది. కానీ ఇంకా నాలుగు విడతల పోలింగ్ జరగాల్సి ఉంది. దేశంలోని అయిదు రాష్ట్రాలలో ఎన్నికలకు శ్రీకారం చుట్టగా ఇప్పటి వరకు ఉత్తరాఖండ్, మణిపూర్ , పంజాబ్ , గోవా రాష్ట్రాలలో పోలింగ్ ముగిసింది.
చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ పూర్తయింది. దేశంలోనే అతి ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగిన రాష్ట్రం యూపీ. ప్రస్తుతం యోగి ఆదిత్యానాథ్ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం కొలువై ఉంది.
గతంలో భారీ మెజారిటీ సాధించిన బీజేపీ ఈసారి అన్ని సీట్లు రావని ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఈ రాష్ట్ర ఎన్నికల ఫలితాలే రెఫరెండమ్ గా భావిస్తోంది భారతీయ జనతా పార్టీ హై కమాండ్.
అందుకే గతంలో లేని విధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, సీఎం యోగి ప్రధానంగా స్టార్ క్యాంపెయినర్లుగా మారారు. ఎలాగైనా సరే మళ్లీ అధికారంలోకి రావాలని యత్నిస్తున్నారు.
ఈ తరుణంలో మోదీ ప్రధాన పోటీ దారుగా భావిస్తున్న సమాజ్ వాది చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) ను టార్గెట్ చేశారు. ఆయన సైకిల్ కు పంక్చర్ అయ్యిందంటూ ఎద్దేవా చేశారు.
దీనిపై అఖిలేష్ సీరియస్ గా స్పందించారు. సైకిల్ ను అవమానిస్తే భారత జాతిని అవమానించినట్లేనంటూ మండిపడ్డారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని జిమ్మిక్కులు చేసినా తాము అధికారంలోకి రావడం ఖాయమన్నారు అఖిలేష్ యాదవ్.
Also Read : అఖిలేష్ ను తండ్రే నమ్మడం లేదు