Lalu Prasad Yadav : ఆర్జీడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav )కు కోలుకోలేని షాక్ తగిలింది. దొరండా దాణా కుంభ కోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ ను దోషిగా నిర్దారించింది సీబీఐ స్పెషల్ కోర్టు. ఇవాళ ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది.
ఈ స్కాంకు సంబంధించి ఐదో కేసు లోనూ ఆయన దోషిగా నిర్దారణ అయ్యింది. తాజాగా దొరండా స్కాల్ లోనూ దోషిగా తేల్చింది గత మంగళ వారంలో . ఇవాళ జైలు శిక్షతో పాటు రూ. 60 లక్షల రూపాయలు చెల్లించాలంటూ ఆదేశించింది కోర్టు.
బీహార్ సీఎంగా కొలువు తీరిన సమయంలో రూ. 950 కోట్ల రూపాయల దాణా స్కాంకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దొరండా ట్రెజీ కేసులో రూ. 139.35 కోట్ల మేర కుంభకోణం జరిగినట్లు నిర్దారణ అయ్యింది.
ఈ కేసులో 99 మంది ఉన్నారు. వీరిలో 24 మదిని రిలీజ్ చేశారు. 46 మందికి మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. ఇదిలా ఉండగా ఇప్పటికే 73 ఏళ్ల వయస్సు ఉన్న లాలూ దాదాపు 14 ఏళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్నారు.
కాగా ఇవాళ శిక్ష ఖరారు చేసేంత దాకా మాజీ సీఎం బెయిల్ పై ఉన్నారు. ఇప్పటికే తనయుడు తన తండ్రి ఆరోగ్యం బాగో లేదని బెయిల్ ఇవ్వాలని కోరారు. ఒకానొక దశలో ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉండింది.
ప్రస్తుతం కోలుకున్నప్పటికీ కేసులు ఆయనను వెంటాడుతున్నాయి. మెరుగైన చికిత్స అందించడంతో కొంత కాలం పాటు నుంచి కోలుకున్నారు. అయితే ఇంకా లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav )కు ఆరో కేసు ఇంకా తీర్పు రావాల్సి ఉంది.
Also Read : మోదీపై అఖిలేష్ యాదవ్ ఫైర్