Tamil Nadu Election : పదేళ్ల తర్వాత జరుగుతున్న నగర పాలిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో(Tamil Nadu Election) డీఎంకే ముందంజలో కొనసాగుతోంది. దీంతో ఆ పార్టీకి చెందిన శ్రేణులు సంబురాల్లో మునిగి పోయారు.
ఈనెల 19న అర్బన్ సివిల్ ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్రంలో 268 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే నుంచి భారతీయ జనతా పార్టీ విడి పోయి ఒంటరిగా బరిలో ఉంది.
ఈ పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తొమ్మిది నెలల కిందట కొలువు తీరిన స్టాలిన్ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమ్ గా భావిస్తున్నారు. ఈ తరుణంలో ఆశించిన మేర కంటే అధికార పార్టీ తన హవాను కొనసాగిస్తోంది.
ఇప్పటికే జనాదరణలో స్టాలిన్ ముందంజలో ఉన్నారు. సంక్షేమ పథకాల అమలులో భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 1, 374 కార్పొరేషన్ వార్డులలో డీఎంకే కడపటి వార్తలు అందేసరికి 57 , ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే 7, ఇతరులు 8 స్థానాల్లో గెలుపొందారు.
డిఎంకే మిత్రపక్షాలు కాంగ్రెస్ 7, సీపీఎం 2 సీట్లలో గెలుపొందినట్లు తమిళనాడు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నటన నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కమల్ పార్టీ ఎంఎన్ఎం ఖాతా తెరవాలని యోచిస్తోంది.
మున్సిపాలిటీలలో 3 వేల 843 స్థానాలకు గాను డీఎంకే 248 స్థానాలు గెలుచు కోగా అన్నాడీఎంకే 79 , ఇతరులు 53 సీట్లు కైవసం చేసుకున్నారు. అన్నాడీఎంకే 354 వార్డులు, డీఎంకే 1,251 స్థానాలలో హవా(Tamil Nadu Election) చెలాయించింది.
ఇక చైన్నైతో పాటు 21 నగరాలు, 138 మున్సిపాలిటీలు, 490 పట్టణ పంచాయతీలు, 12 వేల మందికి పైగా సభ్యులు ఎన్నిక కానున్నారు.
Also Read : మిశ్రా బెయిల్ రద్దు చేయాలంటూ పిటిషన్