Jayant Chaudhary :ఉగ్రవాదులకు, నేరస్తులకు తమ కూటమి సపోర్ట్ చేస్తోందంటూ ప్రధాని మోదీ ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి(Jayant Chaudhary). కులం, మతం పేరుతో రాజకీయం చేయడం మానుకోవాలని హితవు పలికారు.
ఎన్నికల ప్రచారంలో బాగంగా బహ్రెక్ లో పీఎం చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎవరు ఎవరిని వాడుకుంటున్నారో, ఎవరు ఎవరిని ప్రోత్సహిస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు.
రైతులను మోసం చేసింది మీరు కాదా. వారిని వాహనంతో తొక్కించి చంపింది మీ వారే కాదా అని నిప్పులు చెరిగారు జయంత్ చౌదరి(Jayant Chaudhary). యూపీలో పలు పేలుళ్లకు పాల్పడిన వారికి తాము ఎప్పుడూ మద్దతు పలకలేదన్నారు.
తాము ఎక్కడ అన్యాయం జరిగినా నిలదీస్తూనే ఉన్నామన్నారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో ప్రజలు సరైన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమన్నారు.
రాచరిక పాలన సాగిస్తూ, ప్రత్యర్థులపై కేసులు నమోదు చేస్తూ, భయభ్రాంతులకు గురి చేయడం అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. మోదీ ప్రతి అంశాన్ని తనకు అన్వయించు కుంటారంటూ మండిపడ్డారు జయంత్ చౌదరి.
యూపీ ఓటర్లు విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఆర్థికాభివృద్ధి, నిరుద్యోగం, కేసుల గురించి ప్రజలు నిలదీయకుండా ఉండేందుకే ఉక్రెయిన్, రష్యా అంశం ముందుకు తెచ్చారంటూ ఆరోపించారు.
ఓ వైపు ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గుర చేస్తున్న ఘనత మోదీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. కేవలం ఓట్ల కోసమే ప్రజల చెవుల్లో పూలు పెట్టేందుకు ప్రధాని ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు జయంత్ చౌదరి.
Also Read : కేంద్రాన్ని ప్రశ్నించినందుకే అరెస్ట్