Nawab Malik : అంతా అనుకున్నట్టే జరిగింది. మహారాష్ట్రలో ఈడీ రంగంలోకి దిగింది. ఫస్ట్ వికెట్ నేరుగా తమను టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేల్చుతూ వస్తున్న నవాబ్ మాలిక్ పై ఫోకస్ పెట్టింది.
ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి మాలిక్ (Nawab Malik)ను తమ ఆఫీసుకు తీసుకు వెళ్లింది. ఎనిమిది గంటల పాటు ప్రశ్నించింది. చివరకు అరెస్ట్ చేసింది. ఆఫీసు నుంచి నవ్వుతూ బయటకు రావడం కొసమెరుపు.
ఇక కేసు విషయానికి వస్తే నవాబ్ మాలిక్ మనీ లాండరింగ్ కు పాల్పడ్డాడని అభియోగం మోపింది ఈడీ. ముంబై అండర్ వరల్డ్ , పరారీలో ఉన్న గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం , అతని సహాయకుల కార్యకలాపాలతో ముడి పడి ఉందని స్పష్టం చేసింది.
మంత్రిని అరెస్ట్ చేశాక ప్రత్యేక కోర్టు ముందు హాజరు పరిచింది ఈడీ. తనను బలవంతంగా ఇక్కడికి తీసుకు వచ్చారని, ముందుగా సమన్లు పంపి ఉండాల్సింది కానీ అలా చేయలేదంటూ మాలిక్(Nawab Malik)ఆరోపించారు.
తాను తప్పు చేయనని తల వంచనని ఆయన పిడికిలి ఎత్తి చెప్పారు. కేసు గెలుస్తా. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో బయట పెడతానని శపథం చేశారు.
వైద్య పరీక్షల కోసం జేజే ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. గ్యాంగ్ స్టర్ లావాదేవీల గురించి తప్పించుకునే ప్రయత్నం చేశాడంటూ మాలిక్ పై ఆరోపణలు చేసింది ఈడీ.
అరెస్ట్ అనంతరం మహా వికాస్ అగాదీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది మరాఠా సర్కార్. ఎన్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తాము కేంద్రానికి, దాని దర్యాప్తు సంస్థలకు భయపడమని స్పష్టం చేశారు శివసేన నేత సంజయ్ రౌత్.
Also Read : మరాఠా కేబినెట్ అత్యవసర సమావేశం