Russia Ukraine War : ప్రపంచాన్ని పక్కన పెట్టింది రష్యా. తన కంట్లో నలుసు లాగా మారిన ఉక్రెయిన్ (Russia Ukraine War )పై యుద్దం ప్రకటించింది. ఐక్య రాజ్య సమితి యుద్ధాన్ని ఆపాలని, బాంబుల వర్షం కురిపించ వద్దంటూ కోరింది.
కానీ రష్యా చీఫ్ పుతిన్ డోంట్ కేర్ అని స్పష్టం చేశారు. మిస్సైల్స్ ను ప్రయోగిస్తోంది రష్యా. ఇప్పటి దాకా ఆరు నగరాలపై దాడులకు దిగింది. మిలిటరీ ఆపరేషన్ క్లియర్ చేసింది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఈ సందర్భంగా యూరోపియన్ దేశాలను హెచ్చరించారు. ఈ దాడి తమ దేశంపైనే కాదు ఇతర దేశాలను కూడా కబలించే ప్రమాదం పొంచి ఉందంటూ పేర్కొన్నాడు.
ఉక్రెయిన్ నుంచి ఎటువంటి ప్రతిఘటన ఎదురు కాలేదు. ఓ వైపు అమెరికా చీఫ్ బైడెన్ హెచ్చరించినా పట్టంచు కోలేదు పుతిన్. రష్యా ఆర్మీ బలవంతంగా ఉక్రెయిన్ ను చేజిక్కించు కోవాలని అనుకుంటోంది.
యుద్దాన్ని ఆపాలని ఐక్య రాజ్య సమితి కోరినా ఫలితం లేదు. అక్కడ జరిగే ప్రమాదాలకు రష్యా దోషిగా నిల్చోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో కోరినా డోంట్ కేర్ అన్నారు పుతిన్.
ఉక్రెయిన్ లోని తూర్పు ప్రాంతంలోని వేర్పాటు వాదులను రక్షించేందుకు సైనిక చర్యను ఇవాళ ప్రకటించారు. ఉదయం 6 గంటలకు వార్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
ఎక్కడ కూడా ఉక్రెయిన్ ఆర్మీ పోటీ ఇవ్వలేక పోయింది. ఐరోపా రెండు దేశాల మధ్య ప్రయత్నం చేసినా పుతిన్ వెనక్కి తగ్గలేదు. ఉక్రెయిన్(Russia Ukraine War )లోని 11 నగరాల్లో పట్టు సాధించింది. లక్షన్నరకు పైగా సైన్యాన్ని మోహరించింది.
Also Read : శాంతికి మంగళం యుద్ధానికి సిద్దం