TS Tirumurti UN : రష్యా ఉక్రెయిన్ పై దాడులకు దిగడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇవాళ ఉదయం యుద్దాన్ని ప్రకటించారు రష్యా. ప్రత్యేక బలగాలు ఉక్రెయిన్ (TS Tirumurti UN)పై పట్టు సాధించింది.
ఇప్పటికే 11 నగరాలను చేజిక్కించుకుంది. నాటో, యూరోపియన్ కంట్రీస్ తో పాటు అమెరికా జారీ చేసిన హెచ్చరికల్ని పట్టించు కోలేదు. ప్రస్తుతం ప్రపంచంపై పట్టు కోసం చైనా, రష్యా, అమెరికా ప్రయత్నం చేస్తున్నాయి.
ఉక్రెయిన్ ను అడ్డం పెట్టుకుని అమెరికా నాటకాలు చేస్తోందంటూ రష్యా భావించింది. ఈ మేరకు వార్ ప్రకటించింది. ఇప్పటికే ఎయిర్ పోర్ట్ తో పాటు ప్రధాన నగరాలను చేజిక్కించుకుంది.
ఓ వైపు అమెరికా చీఫ్ బైడెన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినా పట్టించు కోలేదు పుతిన్. రష్యా ఉక్రెయిన్ పై దాడి చేయడాన్ని గర్హించింది భారత్. ఐక్య రాజ్య సమితిలోని ప్రధాన దేశాల ప్రతినిధులు ఖండించారు.
రష్యా, ఉక్రెయిన్ ల మధ్య శత్రుత్వం అదుపు చేయక పోతే ఆ ప్రాంతాన్ని తీవ్రంగా అస్థిర పరిచే పెను సంక్షోభానికి దారి తీస్తుందని భారత్ పేర్కొంది.
రష్యా అధికారికంగా స్వతంత్ర దేశాలుగా గుర్తించిన తూర్పు ఉక్రెయిన్ లోని వేర్పాటు వాద నియంత్రణ ప్రాంతాల్లోకి వెళ్లాలని రష్యా చీఫ్. ఈ ప్రాంతంలో శాంతి, భద్రత పూర్తిగా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందన్నారు భారత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి(TS Tirumurti UN).
విభిన్న ప్రయోజనాలను తగ్గించేందుకు అన్ని పక్షాలు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర దేశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read : ఉక్రెయిన్ కు సాయం రష్యాపై యుద్దం