Ukraine President : అధ్య‌క్షుడి భావోద్వేగం ప్ర‌పంచం ఆశ్చ‌ర్యం

శాంతి మా అభిమ‌తం యుద్దం కానే కాదు

Ukraine President : మేం మా మానాన బ‌త‌కాల‌ని కోరుకున్నాం. కానీ ర‌ష్యా మ‌మ్మ‌ల్ని అలా అనుకోవ‌డం లేదు. ఎల్ల‌ప్పుడూ అవ‌స‌ర‌మైన ప్ర‌తి సంద‌ర్భం లోనూ శాంతినే కోరుకున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. కావాల‌ని యుద్దాన్ని ఎవ‌రు కోరుకుంటారు.

త‌రాలు మారాయి. టెక్నాల‌జీ మారింది. కానీ కావాల‌ని క‌య్యానికి కాలు దువ్వుతానంటే ఎలా. నేనే కాదు యావ‌త్ ప్ర‌పంచం అంతా శాంతిని కోరుకుంటోంది. ఇక ముందు కూడా కోరుకోవాలి కూడా. యుద్దం అనివార్యం కాదు. కాకూడ‌దు.

వార్ లో శ‌క‌లాలు, ఆయుధాలు మిగిలి పోతాయి. కానీ మ‌నుషుల స‌మూహం, వ‌న‌రులు, అవ‌కాశాలు లేకుండా పోతాయి. ప్ర‌పంచం పూర్తిగా విద్వేష పూరితంగా మారి పోతోంది. ఇది ఎంత మాత్రం క్షేమ‌క‌రం కాదు.

అది ఇప్పుడు దాడికి గుర‌వుతున్న ఉక్రెయిన్ దేశానికి వ‌ర్తిస్తుంది. స‌మ‌స్త ప్ర‌పంచానికి ఇది ఓ హెచ్చ‌రిక లాంటిది. రాజ్య కాంక్ష‌, ఇంకొక‌రిపై ఆధిప‌త్యం, పెత్త‌నం చెలాయించ‌ల‌ని అనుకునే ప్ర‌తి ఒక్క‌రి వైఖ‌రి ర‌ష్యా చీఫ్ పుతిన్ లాగే ఉంటుంది.

నాపై మీరంతా న‌మ్మ‌కం ఉంచారు. నేను మీతో పాటే ఉన్నాను. మీ కోసం ప్ర‌తినిధిగా ఇవాళ మాట్లాడుతున్నా. కానీ గొంతు లోంచి మాట‌లు రావ‌డం లేదు. మ‌న‌సు బాధ‌గా ఉంది.

జీవితం అంతా ఈ దేశం కోసం అర్పించాల‌ని నేను ఇవాళ ఈ ప‌ద‌విని అధీష్టించాను. కానీ త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ర‌ష్యాతో పోటీ ప‌డాల్సి వ‌స్తోందంటూ వాపోయారు ఉక్రెయిన్ దేశాధ్య‌క్షుడు లోలోడిమిర్ జెలెన్ స్కీ(Ukraine President).

ఆయ‌న జాతిని ఉద్దేశించి తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన ప్ర‌సంగం వీడియో నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

Also Read : యుద్దం ఆప‌క పోతే ప్రమాదం

Leave A Reply

Your Email Id will not be published!