Putin : ఉక్రెయిన్ పై ఏకపక్ష దాడిని పూర్తిగా సమర్థించుకున్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin ). తాము కావాలని దాడికి దిగలేదని కానీ అమెరికా, నాటో దేశాలు ఉక్రెయిన్ ను అడ్డం పెట్టుకుని పావులు కదపాలని చూశాయని ధ్వజమెత్తారు.
తాము కావాలని దాడికి దిగ లేదని స్పష్టం చేశారు. యావత్ ప్రపంచంతో పాటు రష్యాలో కూడా పెద్ద ఎత్తున యుద్దం ఆపాలంటూ ప్రదర్శనలు చేశారు. దీంతో జాతిని ఉద్దేశించి ఉక్రెయిన్ పై ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో స్పష్టం చేశారు.
రష్యాకు పక్కలో బల్లెంలా తయారైంది. పలు సార్లు తమ దేశ అంతర్గత విషయంలో జోక్యం చేసుకోవాలని చూసింది. చాలా సార్లు చెప్పి చూశాం. కానీ పట్టించు కోలేదు. దీంతో సైనిక చర్య చేపట్టాలని నిర్ణయించాం.
అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు పుతిన్. మిలటరీ, ఇతర నిపుణులు స్వతంత్ర దేశాన్ని మ్యాప్ నుంచి తుడిచి పెట్టేందుకు తాము ఈ చర్యకు దిగామన్నారు.
ఉక్రెయిన్ పూర్తిగా తమ స్వాధీనంలోకి రావడం ఖాయమన్నారు. 70 చోట్ల దాడులకు దిగామని అవన్నీ సక్సెస్ అయ్యాయని చెప్పారు. ఎక్కడా పౌరులను తాము లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగలేదని స్పష్టం చేశారు పుతిన్(Putin ).
ప్రధాన నగరాలన్నీ తమ ఆధీనంలోకి వచ్చాయని వెల్లడించారు. మరో వైపు అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రష్యా చీఫ్ కు.
ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని దౌర్జన్యంగా తొలగించాలనే ప్రయత్నం అత్యంత దారుణమన్నారు.
Also Read : రష్యా విధ్వంసం పోరాటం ఆపం