Russia Protest : ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేయడాన్ని యావత్ ప్రపంచం ఈసడించు కుంటోంది. ఐక్య రాజ్య సమితి, నాటో, అమెరికా తీవ్రంగా తప్పు పట్టింది. ఈ తరుణంలో ప్రతి చోటా ఆందోళనలు మిన్నంటాయి.
ప్రదర్శనలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు చోట్ల పోలీసులు దాడులకు పాల్పడ్డారు. కానీ రష్యా చీఫ్ పుతిన్ ఏ మాత్రం తగ్గడం లేదు. రష్యాలో(Russia Protest) సైతం నిరసనలు మిన్నంటినా పట్టించు కోవడం లేదు.
మొన్నటి దాకా మౌనంగా ఉన్న రష్యా ఉన్నట్టుండి యుద్దానికి సిద్దం అంటూ ప్రకటించాడు. ఇక తగ్గేదే లేదంటూ స్పష్టం చేశాడు. ఉక్రెయిన్ ను అడ్డం పెట్టుకుని నాటో, యూరప్ దేశాలు, అమెరికా ఆడుతున్న నాటకాలను పసిగట్టాడు పుతిన్.
అందుకే యుద్దం తప్ప మరో మార్గం లేదని క్లారిటీ ఇచ్చాడు. యుద్దం కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు పుతిన్. ఇదే సమయంలో భారీ ఎత్తున కొనసాగుతున్న ఆందోళను పట్టించు కోలేదు.
విచిత్రం ఏమిటంటే రష్యాలో (Russia Protest)అత్యధిక శాతం ఉక్రెయిన్ పై యుద్దానికి ఓకే చెప్పడం విశేషం. ఏకంగా అమెరికా పైకి సై అంటున్నారు. ఎవరికీ అందనంత దూరంలో ఉన్నారు పుతిన్.
తమపై ఆర్థిక ఆంక్షలు విధించినా ఆయన వెనక్కి తగ్గడం లేదు. ముందుకే సాగుతున్నారు. కంట్లో నలుసుగా మారిన ఉక్రెయిన్ కు చెక్ పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఎన్నో సార్లు చెప్పి చూసినా ఉక్రెయిన్ పట్టంచు కోలేదన్నారు.
అందుకే దాడి చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు రష్యా చీఫ్ పుతిన్. తమ దేశంలో జోక్యం చేసుకోవాలని చూస్తే ఏ దేశం పైన నైనా దాడికి దిగుతామని హెచ్చరించాడు.
Also Read : దాడి తప్ప దారి లేదు – పుతిన్