Sidhu Supreme Court : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూకు కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఫుల్ బీజీగా ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు(Sidhu Supreme Court) బిగ్ షాక్ ఇచ్చింది.
30 ఏళ్ల కిందట ఆయనకు సంబంధించిన కకేసులో ఇచ్చిన తీర్పును మరోసారి సమీక్షించాలని ధర్మాసనం నిర్ణయించింది. దీంతో సిద్దూకు నోటీసులు జారీ చేసింది.
సిద్దూ పాల్పడింది పెద్ద తప్పుగా పరిగణించాలని, ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని బాధిత కుటుంబం సర్వోన్నత న్యాయ స్థానం మెట్లు ఎక్కింది.
ఇదిలా ఉండగా ఘటన జరిగి 33 సంవత్సరాలు దాటి పోవడం, తిరిగి దీని గురించి పిటిషనర్లు మళ్లీ లేవనెత్తడం విడ్డూరంగా ఉందన్నారు న్యాయవాది చిదంబరం. పిటిషన్ పై పలు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా తనకు వ్యతిరేకంగా దాఖలైన దావాను తిరస్కరించాలని కోరుతూ సిద్దూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇన్నేళ్ల కేసును ఇప్పుడు ఎలా పరిగణలోకి తీసుకుంటారంటూ పేర్కొన్నాడు.
కాగా సిద్దూ కోరిన కోర్కెను మన్నించ లేదు ధర్మాసనం. ఏకంగా బాధితుల అభ్యర్థననే పరిగణలోకి తీసుకోవడం విశేషం. దీంతో దీని వెనుక రాజకీయ కోణం ఉందంటూ అనుమానిస్తున్నారు పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ(Sidhu Supreme Court).
1988లో పాటియాలలో సిద్దూతో పాటు స్నేహితుడు రూపీందర్ సింగ్ పార్కింగ్ విషయంలో గుర్నమ్ సింగ్ అనే వ్యక్తితో గొడవ పడ్డారు. అతడిని కారు లోంచి తోసేసి దాడికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో అతడు చని పోయాడు. అప్పట్లో ఈ కేసు సంచలనం కలిగించింది. హర్యానా హైకోర్టు దోషిగా తేల్చి మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 2007లో సిద్దూ సుప్రీంకోర్టు నిర్దోషి అని తేల్చింది.
Also Read : మనోళ్ల కోసం రొమేనియాకు విమానాలు