UP Election 2022 : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఐదో విడత పోలింగ్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇప్పటి వరకు నాలుగు విడత పోలింగ్ ముగిసింది. దేశంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగిన రాష్ట్రంగా యూపీ ఇప్పటికే పేరు పొందింది.
అటు విస్తీర్ణంలో సైతం పెద్దదే. రాష్ట్రంలోని 403 స్థానాలకు ఎన్నికలు (UP Election 2022)జరగనున్నాయి. ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏడు విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది.
ప్రస్తుతం ఐదో విడత ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. 12 జిల్లాల్లోని మొత్తం 61 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఐదో దశ పోలింగ్ కొనసాగుతోంది.
ప్రస్తుతం తూర్పు యూపీలో పోలింగ్ జరగడం విశేషం. గత ఐదేళ్లుగా నిత్యం సమస్యగా మారిన అయోధ్య రామ మందిరం కూడా ఇవాళ జరగనుంది పోలింగ్.
రాష్ట్రంలోని 12 జిల్లాల్లో మొత్తం 693 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 2 కోట్ల 24 లక్షల 77 వేల 494 మంది ఓటర్లు తేల్చనున్నారు. 61 స్థానాల్లో 58 తూర్పు యూపీ, బుందల్ ఖండ్ , మధ్య యూపీ , రాయ్ బరేలీ లోని సలోన్ స్థానానికి ఇవాళ ఓటింగ్ ప్రారంభమైంది.
ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీ లోని మిగతా ఐదు నియోజకవర్గాల్లో నాల్గో దశలో UP Election 2022 ఓటింగ్ జరగనుంది.
కేవలం రెండు నియోజకవర్గాలు మాత్రమేఉన్న చిన్నజిల్లా బుందేల్ ఖండ్ లోని చిత్ర కూట్ కూడా ఇవాళ పోలింగ్ కు సిద్దమైంది.
అమేథీ, ప్రతాప్ గఢ్ , కౌశాంబి, ప్రయాగ్ రాజ్ , బారా బంకి, అయోధ్య బహ్రైచ్ , శ్రావస్తి , గోండా ప్రాంతాల్లో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ సందర్బంగా భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.
Also Read : తోవునా వోజామ్ ఓ సంచలనం