Modi : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని బస్తీలో ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ప్రసంగించారు.
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా, ఏ ఒక్కరికీ ఇబ్బంది అన్నది కలగకుండా చూస్తామని స్పష్టం చేశారు మోదీ(Modi).
తమ ప్రభుత్వం ఎవరికీ నష్టం కలిగించకుండా సంప్రదింపులు జరుపుతోందని, ఆ మేరకు సర్కార్ వారిని తీసుకు వచ్చేందుకు చర్యలు చేపట్టిందన్నారు. మోదీ మరోసారి ప్రతిపక్షాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతీయ జనతా పార్టీలో కుటుంబ పాలన అన్నది ఉండదన్నారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా పారదర్శక పాలన సాగిస్తున్నామని చెప్పారు. కరోనాను కట్టడి చేయడంలో ప్రపంచానికే భారత్ ఆదర్శంగా నిలిచిందన్నారు మోదీ(Modi).
యూపీలో ఇవాల్టితో ఐదో విడత పోలింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం యోగి ఆదిత్యా నాథ్ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. భక్తిలో ఎన్నో రకాలు ఉన్నాయని కానీ దేశభక్తి గొప్పదన్నారు.
తాము అసలైన సిసలైన దేశభక్తులం అంటూ ప్రకటించారు. ఆయన ఆరో విడత ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్నడూ లేని రీతిలో సంక్షేమ పథకాలను తీసుకు వచ్చామని చెప్పారు.
గతంలో ఏలిన కుటుంబ పాలకులు రక్షణ అవసరాల కోసం విదేశాలపై ఆధార పడేవని కానీ ఇప్పుడు ఆత్మ నిర్బర్ భారత్ కే తాము ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రధాని వెల్లడించారు.
Also Read : తోవునా వోజామ్ ఓ సంచలనం