Devendra Fadnavis :మహారాష్ట్రలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఇప్పటికే గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరులతో సత్ సంబంధాలు కలిగి ఉన్నారని, మనీ లాండరింగ్ కు పాల్పడ్డారంటూ మంత్రి నవాబ్ మాలిక్ ను అరెస్ట్ చేసింది ఈడీ.
తాను రాజీనామా చేసినా ఈ రోజు వరకు మహా వికాస్ అగాధీ సంకీర్ణ సర్కార్ ఒప్పు కోలేదు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది భారతీయ జనతా పార్టీ.
అండర్ వరల్డ్ డాన్ తో మాలిక్ సంబంధం ఎలా పెట్టుకుంటాడని ప్రశ్నించారు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ శాసనసభా పక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ .
ఇవాల్టీ నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 1993 ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి దావుద్ ఇబ్రహీంకు సహాయం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నవాబ్ మాలిక్ కు మరాఠా సర్కార్ మద్దతు ఇవ్వడం సరికాదని ఆరోపించారు.
ప్రభుత్వం ఓ వర్గాన్ని కాపాడేందుకు ఉద్దవ్ ఠాక్రే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటూ నిలదీశారు. తాము ఎవరికీ తలవంచమని అంటున్న ప్రభుత్వం దావూద్ ఇబ్రహీం ముందు తలవంచుతుందన్నారు.
ముంబై పేలుళ్లను మరిచి పోయి, అందులో కీలకంగా ఉన్న నిందితుడి నుంచి మంత్రి నవాబ్ మాలిక్ భూములు ఎందుకు కొన్నారని ప్రశ్నించారు దేవేంద్ర ఫడ్నవీస్.(Devendra Fadnavis)
బేషరతుగా నవాబ్ మాలిక్ ను వెంటనే మంత్రి వర్గం నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు ఫడ్నవిస్. ఇదిలా ఉండగా సీఎం ఇచ్చే టీ పార్టీ విందుకు తాము హాజరు కావడం లేదన్నారు.