Arindam Bagchi : ఎన్ని క‌ష్టాలైనా స‌రే తీసుకొస్తాం

ఉక్రెయిన్ భార‌తీయుల‌కు భ‌రోసా

Arindam Bagchi : ఓ వైపు యుద్దం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ర‌ష్యా త‌న దాడుల్ని మ‌రింత ముమ్మ‌రం చేసింది ఉక్రెయిన్ పై. దీంతో ఇప్ప‌ట్లో యుద్ద కాంక్ష చ‌ల్లార‌డం లేదు.

ఇక భార‌త దేశం నుంచి మెడిసిన్ తో పాటు ఇత‌ర కోర్సులు చ‌దువుకునేందుకు భారీ ఎత్తున విద్యార్థులు, భార‌తీయులు త‌ర‌లి వెళ్లారు. ఈ త‌రుణంలో ఓ విద్యార్థి కూడా దుర్మ‌ర‌ణం పాల‌య్యాడు.

దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెల‌కొంది. అక్క‌డ మ‌నవాళ్లు ఎలా ఉన్నారోన‌ని. ఈ సంద‌ర్బంగా ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా ఉక్రెయిన్ నుంచి ఇండియ‌న్ల‌ను స్వ‌దేశానికి తీసుకు వ‌స్తామ‌ని విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి అరిందం బాగ్చి చెప్పారు.

ప్ర‌భుత్వం ఇప్ప‌టికే సంప్ర‌దింపులు జ‌రుపుతోంద‌న్నారు. ఈ విష‌యంపై తాము అన్ని దేశాల ప్ర‌తినిధుల‌తో ట‌చ్ లో ఉన్నామ‌ని బాగ్చి(Arindam Bagchi) స్ప‌ష్టం చేశారు.

మ‌న వాళ్ల‌ను సుర‌క్షితంగా తీసుకు వ‌చ్చేందుకు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఇప్ప‌టికే ఇరు దేశాల అధ్య‌క్షులు గెలెన్స్కీ, పుతిన్ తో మాట్లాడార‌ని వెల్ల‌డించారు.

ఇదిలా ఉండ‌గా ఉక్రెయిన్ నుంచి భార‌త్ కు వ‌చ్చేందుకు గాను 20 వేల మందికి పైగా రిజిస్ట్రేష‌న్ చేయించు కున్నార‌ని స్ప‌ష్టం(Arindam Bagchi) చేశారు. అక్క‌డి నుంచి నేర‌గా ఇక్క‌డికి తీసుకు వ‌చ్చేందుకు మ‌రిన్ని విమానాల‌ను ఉప‌యోగిస్తామ‌న్నారు.

అంతే కాకుండా కీవ్ లోని భార‌త రాయబార ఆఫీసును ఎల్వీవ్ కు త‌ర‌లించామ‌ని వెల్ల‌డించారు. అయితే తాము రాయబార కార్యాల‌యం పూర్తిగా మూసి వేయ‌లేద‌న్నారు. అదంతా అవాస్త‌వ‌మ‌ని పేర్కొన్నారు.

Also Read : న‌వాబ్ మాలిక్ రాజీనామా చేయాల్సిందే

Leave A Reply

Your Email Id will not be published!