Akhilesh Yadav : సమాజ్ వాది పార్టీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ భారతీయ జనతా పార్టీ పై నిప్పులు చెరిగారు. యూపీలో యోగి పాలనకు చరమ గీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రపంచంలో అబద్దాలు ఆడడంలో బీజేపీ టాప్ లో ఉంటుందన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా వారణాసిలో జరిగిన బహిరంగ సలో అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav )ప్రసంగించారు. ప్రపంచంలో అత్యధిక సభ్యులున్న పార్టీ తమదేనని గొప్పలు పోతోందని అన్నారు.
ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ దేశాన్ని భ్రష్టు పట్టించిన ఘనత మోదీదేనని ధ్వజమెత్తారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు దాని గురించి ఆచరణలో పెట్టడం ఏనాడో మరిచి పోయిందన్నారు.
సాగు చట్టాల కోసం పోరాడిన రైతులు చని పోతే స్పందించిన పాపాన పోలేదన్నారు. లఖింపూర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి తనయుడికి బెయిల్ ఎలా వస్తుందని ప్రశ్నించారు.
పూర్తిగా అప్రజాస్వామిక పద్దతిలో నడుస్తోందన్నారు. ఓ వైపు నిరుద్యోగం ఇంకో వైపు ద్రవ్యోల్బణం పెరిగి పోతున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు అఖిలేష్ యాదవ్.
గత ఐదు సంవత్సరాలుగా నిరుద్యోగులు జాబ్స్ కోసం కళ్లల్లో వత్తులు చేసుకుని చూస్తున్నారని కానీ సీఎం యోగి కనికరించడం లేదని ఫైర్ అయ్యారు.
రైతులకు రెట్టింపు ఆదాయం తీసుకు వస్తామని చెప్పిన సర్కార్ ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతుందన్నారు. ఎయిర్ పోర్టుల నుంచి సీ పోర్టుల వరకూ అన్నింటినీ బీజేపీ అమ్మేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : యుద్దోన్మాదం సీజేఐ నిర్వేదం