Jaggi Vasudev : ప‌ర్యావ‌ర‌ణం కోసం స‌ద్గురు ప్ర‌యాణం

లండ‌న్ నుంచి ఇండియాకు సైకిల్ యాత్ర‌

Jaggi Vasudev  : భూమిని కాపాడు కోవాల‌ని, ప‌ర్యావ‌ర‌ణాన్ని ర‌క్షించు కోవాల‌ని ప్ర‌జ‌ల్లో చైత‌న్యం నింపేందుకు స‌ద్గురు జ‌గ్గీ వాసుదేవ‌న్ (Jaggi Vasudev )న‌డుం బిగించారు. లండ‌న్ నుంచి భార‌త్ కు సైకిల్ యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టారు.

ఈనెల 21 నుంచి ఈ యాత్ర‌ను ప్రారంభించ‌నున్నారు. ఈ యాత్ర‌ను 27 దేశాల మీదుగా 100 రోఉల్లో పూర్తి చేసి భార‌త్ ముగుస్తుంద‌ని స్వ‌యంగా జ‌గ్గీ వాసుదేవ‌న్ వెల్ల‌డించారు.

నేల‌పై కాలుష్యాన్ని నివారించేందుకు ప్ర‌తి ఒక్క‌రు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న దేశాల అధినేత‌ల‌ను తాను కోరేందుకే ఈ సైకిల్ యాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

30 వేల కిలోమీట‌ర్ల మేర ఈ ప్ర‌యాణం సాగుతుంద‌న్నారు. ఈ 100 రోజుల యాత్ర‌లో ప్ర‌తి ఒక్క‌రూ క‌నీసం రోజులో 5 నుంచి 10 నిమిషాల పాటు నేల‌ను కాపాడుకుందాం, భ‌విష్య‌త్తు కోసం అన్న నినాదంతో ముందుకు సాగాల‌న్నారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సువిశాల‌మైన‌, అద్భుత‌మైన‌, అనంత‌మైన వ‌న‌రులు క‌లిగిన మ‌ట్టి గురించి మాట్లాడాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇదే త‌న ఆశ‌య‌మ‌ని పేర్కొన్నారు. ఇందుకు గాను ది సేవ్ సాయిల్ మూవ్ మెంట్ పేరుతో శ్రీ‌కారం చుట్టామ‌న్నారు.

రోజు రోజుకు భూమి కుచించుకు పోతోంది. ప‌ర్యావ‌ర‌ణానికి ముప్పు క‌లుగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు జ‌గ్గీ వాసుదేవ‌న్. మ‌నిషి అంటేనే మ‌ట్టి.

ఈ లోకంలో మ‌ట్టికి ఉన్న ప్రాధాన్య‌త ఏమిటో గుర్తించ‌క పోవ‌డం వ‌ల్ల‌నే ఈ లోకంలో ఇన్ని అనర్థాలు క‌లుగుతున్నాయంటూ పేర్కొన్నారు స‌ద్గురు. ప్ర‌స్తుతం జ‌గ్గీ వాసుదేవ‌న్ త‌న బోధ‌న‌ల‌తో ప్ర‌భావితం చేస్తూ సాగుతున్నారు.

Also Read : శ్రీ‌వారి భ‌క్తుల‌కు టీటీడీ తీపి క‌బురు

Leave A Reply

Your Email Id will not be published!