Revanth Reddy : రైతుల కోసం కాంగ్రెస్ ఉద్యమం 

టీపీసీసీ చీఫ్ ఎనుమ‌ల రేవంత్ రెడ్డి 

Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.  రైతుల‌ను న‌ట్టేట ముంచిన ఘ‌న‌త కేసీఆర్ కే ద‌క్కుతుంద‌న్నారు.

యాసంగి ధాన్యం సేక‌రించ బోమంటూ చెప్ప‌డం రైతుల‌ను రాజ‌కీయంగా వాడు కోవ‌డ‌మేన‌ని మండిప‌డ్డారు. ధాన్యం పండించే రైతుల‌కు అండ‌గా తాము ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు కోదండ‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.

ఇందులో భాగంగా రైతులకు న్యాయం చేయాల‌ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). పంట‌ల కొనుగోలు, ఆంక్ష‌లు, ధ‌ర‌ణి స‌మ‌స్య‌లు, రుణ మాపీ వంటి అంశాల‌పై చ‌ర్చించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు.

యాసంగిలో వ‌డ్లు కొనమ‌ని చెప్ప‌డంతో ఈసారి రాష్ట్రంలో కేవ‌లం 35 ల‌క్ష‌ల ఎక‌రాల‌కే ప‌రిమిత‌మైంద‌ని ఆరోపించారు. 70 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం దిగుబ‌డి వ‌చ్చే ఛాన్స్ ఉంద‌న్నారు.

ఈరోజు వ‌ర‌కు యాక్ష‌న్ ప్లాన్ రూపొందించిక పోవ‌డం దారుణ‌మన్నారు. ప్ర‌భుత్వం చేతులెత్తేయ‌డంతో రైతుల ప‌రిస్థితి రెంటికి చెడ్డ రేవ‌డి అన్న చందంగా త‌యారైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

రైతుల‌పై పైకి ప్రేమ ఉన్న‌ట్టు న‌టిస్తూ లోప‌ల వారికి అన్యాయం చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు రేవంత్ రెడ్డి. ఈనెల 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

రైతుల‌కు ఎలాంటి అన్యాయం జ‌రిగినా తాము ఊరుకోబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. రాబోయే కాలంలో వారి ప‌క్షాన ఉంటూ పోరాడుతామ‌ని చెప్పారు.

Also Read : కేసీఆర్ తో తికాయ‌త్..స్వామి భేటీ

Leave A Reply

Your Email Id will not be published!