V Srinivas Goud : తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ (V Srinivas Goud)హత్య కుట్ర కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. రిమాండ్ రిపోర్టులో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా మంత్రి విరసనోళ్ల సీఎం కేసీఆర్ వెంట ఢిల్లీ టూర్ లో ఉన్నారు. హత్య కుట్ర కేసు బయటకు పొక్కడంతో ముందు జాగ్రత్త చర్యగా తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం అలర్ట్ అయ్యింది.
ఈ మేరకు శ్రీనివాస్ గౌడ్ కు అదనపు భద్రత పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు పైలట్ వాహనాలు, 20 మందితో భద్రత కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటి దాకా ఓ పైలట్ సహా 10 మంది సెక్యూరిటీ ఉన్నారు. కేబినెట్ లో మంత్రిగా ఉండడంతో ఎప్పటి లాగే అందరి మంత్రులతో పాటు శ్రీనివాస్ గౌడ్(V Srinivas Goud) కు సెక్యూరిటీ కల్పించారు.
తాజాగా శ్రీనివాస్ గౌడ్ పై హత్య కుట్ర బయట పడడంతో అదనపు సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు రెండు పైలట్ వాహనాలు, 20 మందితో భద్రత కల్పించాలని ఆదేశించింది.
ప్రస్తుతం సీఎం వెంట ఉన్న శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ కు వచ్చాక అదనపు భద్రతా సిబ్బంది విధుల్లో చేరుతారని ఆదేశాలు జారీ చేసింది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు రూ. 15 కోట్ల డీల్ జరిగినట్లు పోలీస్ దర్యాప్తులో తేలడంతో మంత్రికి అదనపు భద్రత పెంచాలని నిర్ణయించింది.
ఈ కేసులో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
Also Read : ఖాకీల తీరుపై బండి కన్నెర్ర