KTR : తెలంగాణ దేశానికి ఆదర్శంగా మారుతోంది. ఇప్పటికే ఐటీ హబ్ గా, ఫార్మా హబ్ గా , గేమింగ్ హబ్ , ఇండస్ట్రియల్ హబ్ గా, అగ్రికల్చర్ హబ్ గా, స్టార్టప్ లకు కేరాఫ్ గా వినుతికెక్కింది.
ఇప్పటికే పలు కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు. తాజాగా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది.
వైద్య పరికరాలు తయారు చేస్తున్న ఎస్3వీ వ్యాస్కులార్ టెక్నాలజీస్ అనే సంస్థ తమ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR).
ట్విట్టర్ ద్వారా ఈ అంశాన్ని వెల్లడించారు. ఈ కంపెనీ రూ. 250 కోట్లు పెట్టుబడిగా పెట్టనుందని తెలిపారు. ఈ కంపెనీ ఏర్పాటు వల్ల 750 మందికి ఉపాధి దొరుకుతుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టనున్న కంపెనీని కేటీఆర్ అభినందించారు. ఇటీవల కేటీఆర్ మాట్లాడుతూ వైద్య పరికరాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తుందన్నారు.
వ్యాక్సినేషన్ తయారీలో, మందుల తయారీలో టాప్ లో ఉన్న హైదరాబాద్ లో ఎందుకు వైద్య పరికరాలను తయారు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ తరుణం ఎస్3వీ టెక్నాలజీస్ ముందుకు రావడం ఆనందం కలిగించిందన్నారు.
ఇప్పటి వరకు 78 శాతం దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా 250 ఎకరాల్లో మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటు చేసిందని కేటీఆర్ వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఈ కంపెనీ ఏర్పాటైతే ప్రత్యక్షంగా 500 మందికి పరోక్షంగా 250 మందికి ఉపాధి కలుగుతుంది.
Also Read : మంత్రికి సెక్యూరిటీ పెంపు