Putin : రష్యా తన దాడులను కొనసాగిస్తోంది. ఎక్కడా ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు రష్యా చీఫ్ వ్లాదిమీర్ పుతిన్. యావత్ ప్రపంచం యుద్దం నిలిపి వేయాలని కోరినా పట్టించు కోవడం లేదు.
ఉక్రెయిన్ స్వచ్చంధంగా లొంగి పోవాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే యూరోపియన్ యూనియన్,
ఐక్య రాజ్య సమితి , బ్రిటన్, ఫ్రాన్స్ , అమెరికా తదితర దేశాలు ఆర్థిక ఆంక్షలు విధించాయి రష్యాపై. అయినా పుతిన్(Putin )వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తో రష్యా చీఫ్ ఫోన్ లో మాట్లాడారు.
ఉక్రెయిన్ ను తటస్థ దేశంగా ఉండాలని కోరుకుంటున్నాం. అంత దాకా తాము ఊరుకునే ప్రసక్తి లేదని వార్నింగ్ ఇచ్చారు. తాము శాంతి చర్చలకు సిద్దంగానే ఉన్నామని కానీ ఉక్రెయిన్ అమెరికా , తదితర దేశాల సపోర్ట్ తో ఎగిరి పడుతోందని దానికి అంత సీన్ లేదన్నారు పుతిన్.
చర్చలకు సంబంధించి ఆలస్యం చేస్తే నష్టం తమకు కాదని ఉక్రెయిన్ కేనని స్పష్టం చేశారు పుతిన్. కీలకమైన తీర ప్రాంత నగరం ఖేర్సన్ ను రష్యా స్వాధీనం చేసుకుంది.
కావాలని ఉక్రెయిన్ తాత్సారం చేస్తోందంటూ మండిపడ్డారు. రష్యా మూకుమ్మడి దాడుల్లో 2 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. విలువైన ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్ పూర్తిగా స్మశానాన్ని తలపింప చేస్తోంది.
ఇదిలా ఉండగా ఉక్రెయిన్ దాడుల్లో రష్యా మేజర్ జనరల్ ఆండ్రీ సుఖోవిట్స్ స్కీ మరణించినట్లు సమాచారం.
Also Read : భారత విద్యార్థిపై కాల్పులు – వీకే సింగ్