Zelensky : ఉక్రెయిన్ పై రష్యా దాడులు ముమ్మరం చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. ఎక్కడ చూసినా శకలాలు, కూలి పోయిన భవనాలు , శిథిలాల కింద నలిగి పోయిన మనుషులు ఇది ఉక్రెయిన్ లో ఉన్న పరిస్థితి.
ఇప్పటికే భారత్ కు చెందిన ఓ విద్యార్థి చని పోయాడు. ఇంకో విద్యార్థిపై కాల్పులు జరిగాయి. మోదీ మాత్రం ప్రచారంలో మునిగి పోయారు. ఇంకా ఎంత మంది భారతీయులు ఉన్నారనేది తెలియడం లేదు.
ఈ తరుణంలో రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఒక్కో నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ వెళుతోంది. అయినా ఎక్కడా తల వంచడం లేదు ఉక్రెయిన్ చీఫ్ గెలెన్స్కీ(Zelensky). చావనైనా చస్తాం కానీ తల వంచే ప్రసక్తి లేదంటున్నారు.
అయితే తల వంచక పోతే తల తీసి వేస్తామని హెచ్చరించారు రష్యా చీఫ్ పుతిన్. ఇవాల్టితో యుద్దం ప్రారంభమై తొమ్మిది రోజులవుతోంది. ఈ భీకరమైన దాడుల్లో పలు నగరాలు రష్యా స్వాధీనం అయ్యాయి.
వార్ ప్రారంభంలో పౌరులను టార్గెట్ చేయమని చెప్పిన పుతిన్ ఆ తర్వాత తల వంచక పోయే సరికి వారిని కూడా చంపుకుంటూ వెళ్లి పోమని ఆదేశాలు ఇవ్వడం దారుణం.
ఇదే సమయంలో ఉక్రెయిన్ లోని జపోరిజ్జియా అణుకర్మాగారంపై దాడి చేయడం ప్రారంభించింది. దీనిపై వెంటనే స్పందించారు జెలెన్స్కీ(Zelensky). ఈ సందర్భంగా వీడియో సందేశాన్ని సోషల్ మీడియా పోస్ట్ చేశారు.
ఇప్పటికే ఈ ప్రపంచానికి చర్నో బిల్ ద్వారా జరిగిన విధ్వేంసం ఏమిటో తెలుసు. అంతకన్నా ఎక్కువ ప్రమాదం ఇందులో చోటు చేసుకునే చాన్స్ ఉందని హెచ్చరించారు.
Also Read : అమెరికాకు రష్యా ఝలక్