Priyanka Gandhi : యూపీలో సమీకరణాలే కాదు రాజకీయాలు సైతం ఈసారి మరింత హీట్ పుట్టిస్తున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది సమాజ్ వాది పార్టీ.
ఈనెల 7తో ఎన్నికల పోలింగ్ పరిసమాప్తం అవుతుంది. 10న రాష్ట్రంలోని ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ప్రకటిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఎస్పీతో పాటు కాంగ్రెస్ ఈ ఎన్నికలపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఏ పార్టీ చేయని సాహసం చేసింది.
ఊహించని రీతిలో 40 శాతానికి పైగా మహిళలకు టికెట్లను కేటాయించింది. అన్ని పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో మునిగి పోయారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi )పూర్తిగా యూపీపై దృష్టి పెట్టారు.
ఇందులో భాగంగా ఆమె విస్తృతంగా పర్యటిస్తూ పాలకుల వైఫల్యాలను ఎండ గడుతున్నారు. యోగి, మోదీ దేశానికి, రాష్ట్రానికి చేసింది ఏమీ లేదంటూ జనాన్ని చైతన్యవంతం చేస్తున్నారు.
ప్రత్యేకించి దళితుల ఓట్లు కీలకం కానున్నాయి ఈ ఎన్నికల్లో. ఇందుకు గాను ప్రియాంక గాంధీ వారణాసి లోని కబీర్ చౌర మఠ్ లో మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు.
సంత్ కబీర్ దాస్ సామాజిక న్యాయం, సమానత్వం కావాలని కోరారు. ఇప్పటి వరకు ఆరు విడతలుగా పోలింగ్ జరిగింది. ఇక ఒకే ఒక విడత పోలింగ్ మిగిలి ఉంది.
ఏడో విడత పోలింగ్ లో 54 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ నియోజకవర్గాల్లో అత్యధికంగా బీసీలు, దళితుల ఓట్లే ఉన్నాయి. అందుకే ప్రియాంక గాంధీ కబీర్ మఠ్ లో ఉండనున్నారు.
Also Read : అమిత్ షా వల్లే జే షాకు పదవి