KCR Hemant Soren : సీఎం కేసీఆర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఇప్పుడు దేశ రాజకీయాలపై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఓ వైపు తెలంగాణలో మరోసారి పవర్ లోకి వచ్చేందుకు భారతీయ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను అపాయింట్ చేసుకున్నారు.
ఆయన ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. ఈ తరుణంలో గతంలో కంటే భిన్నంగా ఈసారి కేసీఆర్ స్వరం పెంచారు. ప్రధానంగా కేంద్రంలో కొలువు తీరిన మోదీపై, బీజేపీ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు.
కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం చెలాయించడం మాను కోవాలని హెచ్చరించారు. ఇందులో భాగంగానే ఆయన బీజేపీయేతర శక్తులను, సంస్థలను, వ్యక్తులను, పార్టీలను, సీఎంలను కలుస్తున్నారు.
ఇప్పటికే తనతో కేరళ సీఎం పినరయ్ విజయన్ భేటీ అయ్యారు. అంతకు ముందు యూపీ ఎస్పీ చీఫ్ అఖిలేష్ తో ములాఖత్ జరిగింది. అనంతరం కేసీఆర్ స్వయంగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ తో పాటు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను కలిశారు.
తాజాగా ఢిల్లీ టూర్ లో భాగంగా ఇవాళ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ను కలుసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన తండ్రి శిబూ సోరేన్ అందించిన సహకారాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. దేశానికి ఇప్పుడు కొత్తగా దిశా నిర్దేశం చేసే నాయకత్వం కావాలని పిలుపునిచ్చారు. కొత్త పంథాలో నడిపించేందుకు అడుగు ముందుకు పడిందన్నారు కేసీఆర్(KCR Hemant Soren).
ప్రత్యామ్నాయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమానికి హేమంత్ తండ్రి శిబూ సోరేన్ బేషరతు మద్దతు తెలిపారని చెప్పారు.
Also Read : తెలంగాణకు క్యూ కట్టిన మరో పరిశ్రమ