Supreme Court : ఉక్రెయిన్ పై రష్యా మూకుమ్మడి దాడికి పాల్పడుతోంది. ఈ తరుణంలో భారత దేశం నుంచి పెద్ద ఎత్తున చదువుకునేందుకు ఉక్రెయిన్ కు వెళ్లారు. అక్కడే చిక్కుకు పోయారు.
ఈ సందర్భంగా విద్యార్థుల భవితవ్యానికి ప్రమాదం ఉందంటూ సుప్రీంకోర్టులో న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(Supreme Court) ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ చేపట్టింది.
ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ. ఉక్రెయిన్ లో చిక్కుకు పోయిన విద్యార్థుల భద్రతకు సంబంధించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇంకా అక్కడే ఉంటూ చిక్కుకు పోయిన భారతీయుల గురించి కేంద్రం ఆన్ లైన్ హెల్ప్ లైన్ , సమాచార డెస్క్ ను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ప్రయత్నాలపై తాను వ్యాఖ్యానించడం లేదని, అయితే ఇదే సమయంలో పేరెంట్స్ ఆందోళనపై తాను ఆవేదన చెందుతున్నానని స్పష్టం చేశారు సీజేఐ ఎన్వీ రమణ.
చరిత్రను చూసి ఇంకా నేర్చుకోలేక పోవడం దారుణమన్నారు. యుద్ద మేఘాలు కమ్ముకుంటున్న సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉండి వుంటే బావుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా ఉక్రెయిన్ లో ఇంకా వందలాది మంది విద్యార్థులు చిక్కుకు పోయారు. వారిని స్వదేశానికి తరలించేందుకు నానా తంటాలు పడుతోంది కేంద్ర ప్రభుత్వం.
ఇప్పటికే ఒక విద్యార్థిని కాల్చి చంపారు. ఇంకో విద్యార్థి ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు. 15 విమానాల ద్వారా 3 వేల మందికి పైగా విద్యార్థులను తీసుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం.
Also Read : ఎస్పీతో స్నేహానికి ఆప్ రెడీ