Om Prakash Rajbhar : సుహెల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ – ఎస్బీఎస్పీ చీఫ్ ఓం ప్రకాశ్ రాజ్ భర్ (Om Prakash Rajbhar)సంచలన కామెంట్స్ చేశారు. ఉత్తరప్రదేశ్ లో ఈనెల 10 తర్వాత యోగి అన్నముఖం ఉండదన్నారు. కాషాయ పార్టీకి ఇక పుట్టగతులు ఉండవన్నారు.
ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటి దాకా రాష్ట్రంలో 403 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఏడు విడతులుగా పోలింగ్ కొనసాగనుంది.
ఇప్పటి వరకు ఆరు విడతలుగా పోలింగ్ పూర్తయింది. ఇక ఒకే ఒక్క విడత మిగిలి ఉంది. ఈనెల 10న ఎన్నికలకు సంబంధించిన పూర్తి ఫలితాలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.
దీంతో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో పాటు సమాజ్ వాది పార్టీ, కాంగ్రెస్ , ఆప్ , బీఎస్పీ, ఎంఐఎం, ఎస్బీఎస్పీ తో పాటు పలు పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ఆయా పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో పోటా పోటీగా దూసుకు పోతున్నాయి. ఇదిలా ఉండగా ప్రధానంగా రాష్ట్రంలో యోగి వర్సెస్ అఖిలేష్ యాదవ్ మధ్య యుద్దంగా మారింది.
2017లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన బీజేపీ ఈసారి జరిగే ఎన్నికల్లో తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. ప్రధానంగా రైతుల సమస్య, నిరుద్యోగుల జాబ్స్ అంశాలే యోగిని తీవ్ర ఇబ్బంది పెడుతోంది.
ప్రధాన ప్రతిపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నాయి. కాబా ఓం ప్రకాశ్ రాజ్ భర్ (Om Prakash Rajbhar)చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 10న 10 గంటల తర్వాత ఎవరు విజేతలో తేలుతుందన్నారు.
Also Read : విద్యార్థుల భద్రతపై సీజేఐ ఆందోళన