Srisailam : మహా శివరాత్రి పర్వదినం ముగిసింది. లక్షలాది మంది భక్తులు నల్లమలలో కొలువైన మల్లన్నను దర్శించుకున్నారు. శ్రీశైల పుణ్య క్షేత్రంలో(Srisailam) అంగరంగ వైభవంగా మహోత్సవాలు ముగిశాయి.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. పర్వదినం సందర్భంగా ఎప్పటి లాగే ఉన్న ఆర్జిత, సర్వ దర్శనం సేవలను నిలిపి వేసింది ఉత్సవాలను పురస్కరించుకొని. తాజాగా వాటిని పునరుద్దరించింది.
ఈ మేరకు మల్లికార్జున స్వామి, భ్రమరాంభ ఆలయంలో ఆర్జిత సేవలు పునః ప్రారంభం అయ్యాయి. దీంతో పాటు భక్తులకు మల్లన్న స్వామి సర్వ దర్శనం కూడా ప్రారంభమైంది.
ఉత్సవాలు ముగిసిన సందర్భంలో ఇవాల్టి నుంచి ఆర్జిత సేవలు, సర్వదర్శనం భాగ్యం కల్పించాలని నిర్ణయించారు. వీటితో పాటు గర్భాలయ అభిషేకం, కుంకుమ అర్చన, ఆర్జిత సేవలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
కరెంట్ , ఆన్ లైన్ బుకింగ్ ద్వారా సేవల టికెట్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ . ఇదిలా ఉండగా ఈనెల 6 నుంచి రోజుకు మూడు సార్లు సామూహిక అభిషేకాలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.
అంతే కాకుండా ఆర్జిత, పరోక్ష సేవ, బ్రేక్ దర్శనం టికెట్లను ఆన్ లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చంటూ స్పష్టం చేశారు. గతంలో ఈఓగా పని చేసిన భరత్ గుప్తా శ్రీశైలం పుణ్య క్షేత్రంను (Srisailam)అద్భుతంగా తీర్చి దిద్దారు.
ఆయన చేసిన ప్రయత్నం ఇప్పుడు శ్రీశైలం వెలిగి పోతోంది. స్వామి వారి సేవలు పునః ప్రారంభం కావడంతో మల్లన్న భక్తులు సంతోషానికి లోనవుతున్నారు.
Also Read : వాడవాడలా వెంకన్న ఆలయాలు నిర్మిస్తాం