Russia Ukraine War : రష్యా ఉన్నట్టుండి యూటర్న్ తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఒత్తిళ్ల నేపథ్యంలో కీలక నిర్ణయం ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం.
ఉక్రెయిన్ పై ఏకధాటిగా దాడులకు దిగుతున్న రష్యా (Russia Ukraine War )ఆసక్తికర మైన నిర్ణయం తీసుకోవడంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండానే దాడులకు పాల్పడడంతో పచ్చగా ఉన్న ఉక్రెయిన్ ఇప్పుడు వల్లకాడుగా మారి పోయింది.
ఎక్కడ చూసినా కూలిన భవనాలు, శిథిలాల కింద మృత దేహాలు కంటతడి పెట్టిస్తున్నాయి. ఈ తరుణంలో ఉక్రెయిన్ లో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ఐక్య రాజ్య సమితితో పాటు యూరోపియన్ దేశాలు, అమెరికా, ఫ్రాన్స్ , బ్రిటన్ మొత్తుకున్నాయి.
మరో వైపు చైనా చూసీ చూటనట్టుగా వ్యవహరిస్తోంది. ప్రధానంగా ఉక్రెయిన్ విషయంలో చైనా రష్యా వైపు నిలబడింది. ఇంకో వైపు ఉక్రెయిన్ తరపున యూరోపియన్ యూనియన్,
అమెరికా బేషరతు మద్దతు ప్రకటించడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. దీంతో ఉక్రెయిన్(Russia Ukraine War )లో కాల్పుల విరమణ ప్రకటించి ఆశ్చర్య పోయేలా చేసింది రష్యా. దీంతో యుద్దానికి తాత్కాలికంగా విరామం ఏర్పడంది.
భారత కాలమనం ప్రకారం ఇవాళ ఉదయం 11.30 గంటల నుంచి కాల్పులను ఆపి వేసింది. ఈ బ్రేక్ ఐదున్నర గంటల పాటు ఉంటుందని రష్యా చీఫ్ పుతిన్ ప్రకటించారు.
దీంతో ఉక్రెయిన్ లో ఉన్న విదేశీయులు ఇతర దేశాలకు వెళ్లేందుకు మార్గం ఏర్పడుతుంది. ఇందులో భాగంగానే విదేశీయులను తరలించేందుకు విరామం ఇస్తామని రష్యా యూఎన్ హెచ్ ఆర్ సీకి వెల్లడించింది.
Also Read : ఉక్రెయిన్ చీఫ్ కు అరుదైన ఆహ్వానం