Revanth Reddy : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ పనై పోయిందన్నారు. ఎంత మంది పీకేలు వచ్చినా సీఎంను కాపాడలేరని అన్నారు.
డిసెంబర్ లో అసెంబ్లీని రద్దు చేసి మార్చి నెలలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమని చెప్పారు. ఇవాళ మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని మేడ్చల్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రసంగించారు. తాము పవర్ లోకి రావడం ఖాయమన్నారు. ప్రగతి భవన్ ను డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెడతామని ప్రకటించారు. తెలంగాణలో సోనియమ్మ రాజ్యం తీసుకు వస్తామన్నారు.
అధికారంలోకి వచ్చాక డివిజన్ లో నేతలు చెప్పిన వారికే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. పేదలకు ఇళ్లు, ఫించన్లు ఇస్తామన్నారు. ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ కోరారు రేవంత్ రెడ్డి. పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. చివరి గింజ వరకు తాము కొంటామని స్పష్టం చేశారు.
డిజిటల్ సభ్యత్వ నమోదులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం టాప్ లో నిలిచిందన్నారు. ఎలాంటి సమస్యలు లేకుండా డిజిటల్ సభ్యత్వాన్ని నమదు చేయాలని పిలుపునిచ్చారు టీపీసీసీ చీఫ్.
పార్టీ హైకమాండ్ 30 లక్షల సభ్యత్వ నమోదు చేయాలని టార్గెట్ పెట్టిందని, కానీ ఇప్పటికే 40 లక్షల సభ్యత్వాలు నమోదు చేశామన్నారు. ఇంకా ఎక్కువ అవుతాయని తెలిపారు. పని చేసిన ప్రతి ఒక్కరినీ పార్టి గుర్తిస్తుందన్నారు రేవంత్ రెడ్డి.
Also Read : దేశానికి కొత్త నాయకత్వం అవసరం